Title (Indic)దైవము పుట్టించినట్టి తన సహజమే కాక WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) దైవము పుట్టించినట్టి తన సహజమే కాక కోవిదునికైనా జాలిగుణ మేల విడుచు (॥దైవ॥) ఆరయఁ బంచదార నద్దుక తినఁబోతే చేరరాని ముష్టిగింజ చేఁదేల మాను సారమైన చదువులు సారె సారెఁ జదివినా గోరపు దుష్టునికి కోపమేల మాను (॥దైవ॥) నిప్పు దెచ్చి వొడిలోన నియమానఁ బెట్టుకొంటే యెప్పుడును రాఁజుఁగాక యిది యేల మాను ముప్పిరిఁ బాతకుఁడైన మూఢుఁడెన్ని యాచారాలు తప్ప కెంతసేసినాను దయ యేల కలుగు (॥దైవ॥) యింటిలోనఁ గొక్కు దెచ్చి యిరవుగఁ బెట్టుకొంటే దంటయై గోడలు వడఁదవ్వ కేలమాను గొంటరై శ్రీవేంకటేశుఁ గొలువకుండినవాఁడు తొంటి సంసారవుఁగాక దొర యేఁటి కౌను English(||pallavi||) daivamu puṭṭiṁchinaṭṭi tana sahajame kāga kovidunigainā jāliguṇa mela viḍusu (||daiva||) ārayam̐ baṁchadāra nadduga tinam̐bode serarāni muṣhṭigiṁja sem̐dela mānu sāramaina saduvulu sārĕ sārĕm̐ jadivinā gorabu duṣhṭunigi kobamela mānu (||daiva||) nippu dĕchchi vŏḍilona niyamānam̐ bĕṭṭugŏṁṭe yĕppuḍunu rām̐jum̐gāga yidi yela mānu muppirim̐ bādagum̐ḍaina mūḍhum̐ḍĕnni yāsārālu tappa kĕṁtasesinānu daya yela kalugu (||daiva||) yiṁṭilonam̐ gŏkku dĕchchi yiravugam̐ bĕṭṭugŏṁṭe daṁṭayai goḍalu vaḍam̐davva kelamānu gŏṁṭarai śhrīveṁkaḍeśhum̐ gŏluvaguṁḍinavām̐ḍu tŏṁṭi saṁsāravum̐gāga dŏra yem̐ṭi kaunu