Title (Indic)దైవము నెరఁగము తత్వముఁ దలఁచము WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) దైవము నెరఁగము తత్వముఁ దలఁచము చేవై హరి రక్షించీ నిదివో (॥దైవ॥) పాపముఁ బుణ్యముఁ బైకొను దేహము కోపము శాంతపుగుణములది వోపికవోపము లుదుటు చూపెడిది చేపట్టుక యిటు చెలఁగే మిదివో (॥దైవ॥) వెలికిని లోనికి విడిసేటిప్రాణము చలువలు వేండ్లు చల్లెడిది తెలివికి నిదురకుఁ దేపై యున్నది బలిమిఁ జేపట్టుక బ్రదికే మిదివో (॥దైవ॥) పరమును నిహమునుఁ బట్టినజీవుఁడ పొరుగుకు నింటికిఁ బొత్తైతి గరిమల శ్రీవేంకటపతి శరణని నిరతపు మహిమల నెగడే మిదివో English(||pallavi||) daivamu nĕram̐gamu tatvamum̐ dalam̐samu sevai hari rakṣhiṁchī nidivo (||daiva||) pābamum̐ buṇyamum̐ baigŏnu dehamu kobamu śhāṁtabuguṇamuladi vobigavobamu luduḍu sūbĕḍidi sebaṭṭuga yiḍu sĕlam̐ge midivo (||daiva||) vĕligini lonigi viḍiseḍiprāṇamu saluvalu veṁḍlu sallĕḍidi tĕlivigi niduragum̐ debai yunnadi balimim̐ jebaṭṭuga bradige midivo (||daiva||) paramunu nihamunum̐ baṭṭinajīvum̐ḍa pŏrugugu niṁṭigim̐ bŏttaidi garimala śhrīveṁkaḍabadi śharaṇani niradabu mahimala nĕgaḍe midivo