Title (Indic)దైవమే యెఱుఁగుగాక తలవే నీవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) దైవమే యెఱుఁగుగాక తలవే నీవు వేవేలు వచ్చెఁ జాలు విడవే నీవు (॥దైవ॥) మనసు లేకములైతే మరి యెందు వోయీని తనసు ద్దేఁటికిఁ జెప్పీ తలవే నీవు చనవు గలితేఁ జాలు సోదించఁ బొద్దులేదా వినివిని వేసరితి విడవే నీవు (॥దైవ॥) తానే విచ్చేసునట తగులేల పాసీని దానికేమి గొఱతాయ తలవే నీవు నాననీవే వలపులు నాకుఁ దన కెందువోయీ వీనులెల్లాఁ జల్లనాయ విడవే నీవు (॥దైవ॥) కాయములు సోఁకితేనే కరఁగక మానీనా దాయగాఁ డింతే తాను తలవే నీవు పాయపు శ్రీవేంకటాదిపతి నన్ను నిదె కూడె వేయకు నిష్టూర మిఁక విడవే నీవు English(||pallavi||) daivame yĕṟum̐gugāga talave nīvu vevelu vachchĕm̐ jālu viḍave nīvu (||daiva||) manasu legamulaide mari yĕṁdu voyīni tanasu ddem̐ṭigim̐ jĕppī talave nīvu sanavu galidem̐ jālu sodiṁcham̐ bŏdduledā vinivini vesaridi viḍave nīvu (||daiva||) tāne vichchesunaḍa tagulela pāsīni dānigemi gŏṟadāya talave nīvu nānanīve valabulu nāgum̐ dana kĕṁduvoyī vīnulĕllām̐ jallanāya viḍave nīvu (||daiva||) kāyamulu som̐kidene karam̐gaga mānīnā dāyagām̐ ḍiṁte tānu talave nīvu pāyabu śhrīveṁkaḍādibadi nannu nidĕ kūḍĕ veyagu niṣhṭūra mim̐ka viḍave nīvu