Title (Indic)దైవమే నేరుచుఁ గాక తగిలించ విడిపించ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) దైవమే నేరుచుఁ గాక తగిలించ విడిపించ యీవల సంసారికి నేమి సేయ వచ్చును (॥దైవ॥) ఆస యెచ్చోట నుండు నక్కడ దైన్యము నుండు వాసులన్నీ నెందు నుండు వన్నెలు నందుండు వేసట యెక్కడ నుండు వీతరాగ మాడనుండు యీసుల నీలంకెవాప నెవ్వరికిఁ దరము (॥దైవ॥) అతికోప మేడనుండు నజ్ఞాన మాడనుండు మతిఁ బంత మెందుండు మత్సర మందుండు మతకము లేడనుండు మాయలును నందు నుండు యితరు లెవ్వరు నిందు కేమనఁగలరు (॥దైవ॥) తనభక్తి యెందుండు తపమును నందుండు మనసెందు నుండు దీమసమును నందుండు తనివి యొక్కడ నుండు తగు సుఖ మందుండు తనర శ్రీ వేంకటేశు దైవికము లివియే English(||pallavi||) daivame nerusum̐ gāga tagiliṁcha viḍibiṁcha yīvala saṁsārigi nemi seya vachchunu (||daiva||) āsa yĕchchoḍa nuṁḍu nakkaḍa dainyamu nuṁḍu vāsulannī nĕṁdu nuṁḍu vannĕlu naṁduṁḍu vesaḍa yĕkkaḍa nuṁḍu vīdarāga māḍanuṁḍu yīsula nīlaṁkĕvāba nĕvvarigim̐ daramu (||daiva||) adigoba meḍanuṁḍu najñāna māḍanuṁḍu madim̐ baṁta mĕṁduṁḍu matsara maṁduṁḍu madagamu leḍanuṁḍu māyalunu naṁdu nuṁḍu yidaru lĕvvaru niṁdu kemanam̐galaru (||daiva||) tanabhakti yĕṁduṁḍu tabamunu naṁduṁḍu manasĕṁdu nuṁḍu dīmasamunu naṁduṁḍu tanivi yŏkkaḍa nuṁḍu tagu sukha maṁduṁḍu tanara śhrī veṁkaḍeśhu daivigamu liviye