Title (Indic)దైవమా యేమి సేతు తలఁప నీవే దిక్కు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) దైవమా యేమి సేతు తలఁప నీవే దిక్కు భావించి చదువఁబోయి పశుబుద్ధినైతి (॥దైవ॥) కననా సంసారము కడలేని భారమౌట కనినాఁ దొలఁగరాదు కాలురులు విననా యీ దేహము విరసపు హేయమౌట వినినా జిగురుఁ గండె విడిపించరాదు (॥దైవ॥) తెలియనా ఇంద్రియాలు ద్రిష్టపు విరోధమౌట తెలిసినాఁ బోఁగువలెఁ దెంచరాదు పలుకనా పాపములు పాయని బంధములని పలికినాఁ గొన్న వెఱ్ఱి పట్టితోయరాదు (॥దైవ॥) యెఱఁగనా యీలోకమిది మాయమయమని యెఱిఁగినాఁ బడ్డవోఁద మెక్కరాదు మెఱయ శ్రీవేంకటేశ మేనిలోననే వుండి మఱియును నన్నునేల మన్నన సేసితివి English(||pallavi||) daivamā yemi sedu talam̐pa nīve dikku bhāviṁchi saduvam̐boyi paśhubuddhinaidi (||daiva||) kananā saṁsāramu kaḍaleni bhāramauḍa kaninām̐ dŏlam̐garādu kālurulu vinanā yī dehamu virasabu heyamauḍa vininā jigurum̐ gaṁḍĕ viḍibiṁcharādu (||daiva||) tĕliyanā iṁdriyālu driṣhṭabu virodhamauḍa tĕlisinām̐ bom̐guvalĕm̐ dĕṁcharādu paluganā pābamulu pāyani baṁdhamulani paliginām̐ gŏnna vĕṭri paṭṭidoyarādu (||daiva||) yĕṟam̐ganā yīlogamidi māyamayamani yĕṟim̐ginām̐ baḍḍavom̐da mĕkkarādu mĕṟaya śhrīveṁkaḍeśha menilonane vuṁḍi maṟiyunu nannunela mannana sesidivi