Title (Indic)దైవమా వో దైవమా నన్ను దయఁజూడఁ దగదా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) దైవమా వో దైవమా నన్ను దయఁజూడఁ దగదా నే వెఱ్ఱివాఁడనైతే నీవు వెఱ్ఱివా (॥దైవ॥) చవిగొంటి నెత్తురెల్లా చన్నుఁబాలనుచు నేను భువిఁ దొల్లే నోచితి పుట్టేనంటాను యివల గడుపులోన హేయమౌతాఁ గూడవుతా నివిరి నన్నెరఁగను నిన్నెరిఁగేనా (॥దైవ॥) మొగిఁ జావుకు వెరతు ముందర గాన నేను వెగటు లంపటమైతే వేసరుకొందు వగపును నగవును పడి నొక్క మొకమందే తగులైనవాఁడ నీపై తలఁపు నాకున్నదా (॥దైవ॥) మతి భ్రమసితిఁ గొంత మన్ను నాకు రాజ్యమని సతులంటా సుతులంటా సంసారినైతి గతియై శ్రీవేంకటేశ కాచితి వింతటిలోనే యితరుఁడ నింతే నీకు నేమి బాఁతి నేను English(||pallavi||) daivamā vo daivamā nannu dayam̐jūḍam̐ dagadā ne vĕṭrivām̐ḍanaide nīvu vĕṭrivā (||daiva||) savigŏṁṭi nĕtturĕllā sannum̐bālanusu nenu bhuvim̐ dŏlle nosidi puṭṭenaṁṭānu yivala gaḍubulona heyamaudām̐ gūḍavudā niviri nannĕram̐ganu ninnĕrim̐genā (||daiva||) mŏgim̐ jāvugu vĕradu muṁdara gāna nenu vĕgaḍu laṁpaḍamaide vesarugŏṁdu vagabunu nagavunu paḍi nŏkka mŏgamaṁde tagulainavām̐ḍa nībai talam̐pu nāgunnadā (||daiva||) madi bhramasidim̐ gŏṁta mannu nāgu rājyamani sadulaṁṭā sudulaṁṭā saṁsārinaidi gadiyai śhrīveṁkaḍeśha kāsidi viṁtaḍilone yidarum̐ḍa niṁte nīgu nemi bām̐ti nenu