Title (Indic)దైవమా నిన్ను దూర దగవు గాదు నా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) దైవమా నిన్ను దూర దగవు గాదు నా భావములో నున్నాఁడ వీ పరిపాటి చాలదా (॥దైవ॥) పుట్టించిన దైవమవు పూరి మేపేవా నెట్టన నిహము తొల్లే నీ సంకల్పమూ పట్టులేక నా మనసు పరువులు వెట్టి నిన్ను గట్టిగాఁ గొలువని నా కర్మ మింతే కాక (॥దైవ॥) యిచ్చితివి దేహము యింద్రియములఁ బూంచితి నిచ్చలు నా బ్రదు కెల్ల నీ సూత్రము యిచ్చ నా స్వతంత్రమంటా యిందు నందుఁ బొరలుచు కచ్చి నిన్నుఁ దలఁచని కల్ల యింతే కాక (॥దైవ॥) ముందరిజన్మ మానె మున్నిటిపాపము దీరె సందడి నీ దాసులకు శరణనఁగా అంది శ్రీ వేంకటేశ్వర ఆచార్యుననుమతి కందువ దెలిసె పుణ్యకర్మ మింతే కాక English(||pallavi||) daivamā ninnu dūra dagavu gādu nā bhāvamulo nunnām̐ḍa vī paribāḍi sāladā (||daiva||) puṭṭiṁchina daivamavu pūri mebevā nĕṭṭana nihamu tŏlle nī saṁkalbamū paṭṭulega nā manasu paruvulu vĕṭṭi ninnu gaṭṭigām̐ gŏluvani nā karma miṁte kāga (||daiva||) yichchidivi dehamu yiṁdriyamulam̐ būṁchidi nichchalu nā bradu kĕlla nī sūtramu yichcha nā svadaṁtramaṁṭā yiṁdu naṁdum̐ bŏralusu kachchi ninnum̐ dalam̐sani kalla yiṁte kāga (||daiva||) muṁdarijanma mānĕ munniḍibābamu dīrĕ saṁdaḍi nī dāsulagu śharaṇanam̐gā aṁdi śhrī veṁkaḍeśhvara āsāryunanumadi kaṁduva dĕlisĕ puṇyagarma miṁte kāga