Title (Indic)దైవమా నీకు వెలితా తలఁపు వెలితే కాక WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) దైవమా నీకు వెలితా తలఁపు వెలితే కాక వేవేలు కర్మాల వేసారఁగ వలసె (॥దైవ॥) హరి యంటే బాపేటి అన్ని పాపాలు సేసిన పొరి నందుపై నమ్మిక పుట్టదుగాక నరసింహ యంటే వచ్చే నానాపుణ్యాలకు తిరముగా ఋణములు దీర్చుకొనఁగలవా (॥దైవ॥) దేవ జగన్నాథ యంటే తెగనిజన్మము లేవి కైవశము నామనసు గాదుగాక గోవింద యనియంటేఁ గూడని పదవు లేవి కావిరిఁ గాల మూరకె గడుపేము నేము (॥దైవ॥) వేదనారాయణమంటే వీడేటిబంధములు ఆదిగా మూఁడులోకాలనైనా నున్నదా శ్రీదేవిపతి యైన శ్రీవేంకటేశ్వరుఁడా యేదెసా నీవే నన్ను యీడేర్తువుగాక English(||pallavi||) daivamā nīgu vĕlidā talam̐pu vĕlide kāga vevelu karmāla vesāram̐ga valasĕ (||daiva||) hari yaṁṭe bābeḍi anni pābālu sesina pŏri naṁdubai nammiga puṭṭadugāga narasiṁha yaṁṭe vachche nānābuṇyālagu tiramugā ṛṇamulu dīrsugŏnam̐galavā (||daiva||) deva jagannātha yaṁṭe tĕganijanmamu levi kaivaśhamu nāmanasu gādugāga goviṁda yaniyaṁṭem̐ gūḍani padavu levi kāvirim̐ gāla mūragĕ gaḍubemu nemu (||daiva||) vedanārāyaṇamaṁṭe vīḍeḍibaṁdhamulu ādigā mūm̐ḍulogālanainā nunnadā śhrīdevibadi yaina śhrīveṁkaḍeśhvarum̐ḍā yedĕsā nīve nannu yīḍerduvugāga