Title (Indic)దైవమా నీతప్పు లేదు తలఁచేవారి భాగ్యమే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) దైవమా నీతప్పు లేదు తలఁచేవారి భాగ్యమే వేవేలుగా నుతియించీ వేదములే నిన్నును (॥దైవమా॥) నీవు గలవనేచోట నీ గుణములు గలవే నీవు లేని చోట నిర్గుణ మౌను భావించితే మనసులోఁ బరగు నీ సాకారము ఆవల నిన్నుఁ గానని దది నిరాకారము (॥దైవమా॥) యెఱిఁగి కనుఁగొంటేను యీ జగ మెల్లా నిజము యెఱుఁగక మఱచితే నింతా మిథ్యా వుఱక భక్తి సేసితే నుండు నందు భేదము నెఱయా నొల్లకుండితే నిలుచు నభేదము (॥దైవమా॥) తపము ఫలించెనంటే దండ నుండు మోక్షము యెపుడు నిష్పలమంటే యెన్నఁడు లేదు కృప నలమేల్మంగ కధిప శ్రీవేంకటేశ్వర కపటము లిఁక నేల కావవే యిందఱిని English(||pallavi||) daivamā nīdappu ledu talam̐sevāri bhāgyame vevelugā nudiyiṁchī vedamule ninnunu (||daivamā||) nīvu galavanesoḍa nī guṇamulu galave nīvu leni soḍa nirguṇa maunu bhāviṁchide manasulom̐ baragu nī sāgāramu āvala ninnum̐ gānani dadi nirāgāramu (||daivamā||) yĕṟim̐gi kanum̐gŏṁṭenu yī jaga mĕllā nijamu yĕṟum̐gaga maṟaside niṁtā mithyā vuṟaga bhakti seside nuṁḍu naṁdu bhedamu nĕṟayā nŏllaguṁḍide nilusu nabhedamu (||daivamā||) tabamu phaliṁchĕnaṁṭe daṁḍa nuṁḍu mokṣhamu yĕbuḍu niṣhpalamaṁṭe yĕnnam̐ḍu ledu kṛpa nalamelmaṁga kadhiba śhrīveṁkaḍeśhvara kabaḍamu lim̐ka nela kāvave yiṁdaṟini