Title (Indic)దైవమా నీపెరరేఁపణ లివి తప్పక వున్నవి జీవులకు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) దైవమా నీపెరరేఁపణ లివి తప్పక వున్నవి జీవులకు భావించి కాదని దొబ్బి దీకొనఁగ బ్రహ్మాదులకైనను వసమా (॥దైవ॥) యెక్కడ సిద్ధించు బ్రహ్మచర్యము యెదుటనే కాంతలఁ జూచినవేళను చక్కఁగా మనోవ్యభిచారంబునఁ జలియించుం గాక చిక్కునే విరతి ధనధాన్యంబులు చేతికి లోనయినఁ జూచి వొక్కటియై తా నండే మగ్నమునొందించుం గాక (॥దైవ॥) కలుగునే తనివి బహుపదార్థములు గక్కన నంగళ్లనుఁ జూచి కొలఁదిమీఱఁ గడుతరితీపులతో కోరుచు నోరూరుం గాక వలనుగ సమాధి యెటువలె దొరకొను వాజవారణంబులఁ జూచి యెలమితోడ ముంగిళ్లనెల్లఁ జరియింపించుఁ గాక (॥దైవ॥) యేరీతి నెలకొను నీమీఁదితలఁపు యిహలోకపుసౌఖ్యము చూచి భారపు లంపటములు పై దగిలించి పనులకుఁ బురికొలుపుఁ గాక ధారుణి నే నివి గెలుచుట యెన్నఁడు తగ శ్రీవేంకటనాయక నీవే గారవించి రక్షింపుము నీ కిది కడునుపకారంబౌఁ గాక English(||pallavi||) daivamā nībĕrarem̐paṇa livi tappaga vunnavi jīvulagu bhāviṁchi kādani dŏbbi dīgŏnam̐ga brahmādulagainanu vasamā (||daiva||) yĕkkaḍa siddhiṁchu brahmasaryamu yĕduḍane kāṁtalam̐ jūsinaveḽanu sakkam̐gā manovyabhisāraṁbunam̐ jaliyiṁchuṁ gāga sikkune viradi dhanadhānyaṁbulu sedigi lonayinam̐ jūsi vŏkkaḍiyai tā naṁḍe magnamunŏṁdiṁchuṁ gāga (||daiva||) kalugune tanivi bahubadārdhamulu gakkana naṁgaḽlanum̐ jūsi kŏlam̐dimīṟam̐ gaḍudaridībulado korusu norūruṁ gāga valanuga samādhi yĕḍuvalĕ dŏragŏnu vājavāraṇaṁbulam̐ jūsi yĕlamidoḍa muṁgiḽlanĕllam̐ jariyiṁpiṁchum̐ gāga (||daiva||) yerīdi nĕlagŏnu nīmīm̐didalam̐pu yihalogabusaukhyamu sūsi bhārabu laṁpaḍamulu pai dagiliṁchi panulagum̐ burigŏlubum̐ gāga dhāruṇi ne nivi gĕlusuḍa yĕnnam̐ḍu taga śhrīveṁkaḍanāyaga nīve gāraviṁchi rakṣhiṁpumu nī kidi kaḍunubagāraṁbaum̐ gāga