Title (Indic)దైవమా నీ వొక్కఁడవే దక్కిన ధనము గాక WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) దైవమా నీ వొక్కఁడవే దక్కిన ధనము గాక యీవలానావలా మఱి యెంచ నేమున్నది (॥దైవ॥) పుట్టినవారికెల్లా పొత్తుల దీజగము మెట్టికూచుండే యరఁగు మేదినియల్లా బట్టబయటి భోగాలు బంతికూటిబోజనాలు పట్టి తమపని యేరుపరచ నేమున్నది (॥దైవ॥) పంచుకొన్నభాగాలు పంచమహాభూతాలు పంచేంద్రియములే పరివారాలు యెంచి నడచేకాలమే యిందరికి నుంబళి తెంచి యెచ్చుకుందు లిందుఁ దెలుప నేమున్నది (॥దైవ॥) మనోవికారాలు మానుషపు టెఱుకలు వినోదమాత్రాలు వేడుకలెల్లా యెనలేని శ్రీవేంకటేశ నీమహిమ లివి వెనకా ముందరా విన్నవించ నేమున్నది English(||pallavi||) daivamā nī vŏkkam̐ḍave dakkina dhanamu gāga yīvalānāvalā maṟi yĕṁcha nemunnadi (||daiva||) puṭṭinavārigĕllā pŏttula dījagamu mĕṭṭigūsuṁḍe yaram̐gu mediniyallā baṭṭabayaḍi bhogālu baṁtigūḍibojanālu paṭṭi tamabani yerubarasa nemunnadi (||daiva||) paṁchugŏnnabhāgālu paṁchamahābhūdālu paṁcheṁdriyamule parivārālu yĕṁchi naḍasegālame yiṁdarigi nuṁbaḽi tĕṁchi yĕchchuguṁdu liṁdum̐ dĕluba nemunnadi (||daiva||) manovigārālu mānuṣhabu ṭĕṟugalu vinodamātrālu veḍugalĕllā yĕnaleni śhrīveṁkaḍeśha nīmahima livi vĕnagā muṁdarā vinnaviṁcha nemunnadi