Title (Indic)దైవమా నీ చేఁతలు తప్పదు మా రోఁతలు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) దైవమా నీ చేఁతలు తప్పదు మా రోఁతలు యేవలఁ జూచినఁ బాయ దేమందమయ్యా (॥దైవ॥) కాయములో హేయమదె కమ్మఁబూఁత మీఁద నదె రోయదు చిత్తమునకు రుచియే తోఁచీ మాయలనే పొరలేది మాఁటలనే విసిగేది యేయెడఁ గనీ గాన మేమందమయ్యా (॥దైవ॥) పుట్టుగది యెంగిలి పూఁచిన దాచారము గుట్టు చెడదందునాను గుణమే తోఁచీ వట్టియాసఁ బొరలేది వంతఁ బడి తిరిగేది యెట్టు వేగించఁగవచ్చు నేమందమయ్యా (॥దైవ॥) నిక్కిచూచితే నెరుక నిద్దిరించితే మరపు మక్కళించినబదుకు మంచిదై తోఁచీ మిక్కిలి శ్రీవేంకటేశ మీకు నేను శరణంటే యెక్కువాయ నాపదవి యేమందమయ్యా English(||pallavi||) daivamā nī sem̐talu tappadu mā rom̐talu yevalam̐ jūsinam̐ bāya demaṁdamayyā (||daiva||) kāyamulo heyamadĕ kammam̐būm̐ta mīm̐da nadĕ royadu sittamunagu rusiye tom̐sī māyalane pŏraledi mām̐ṭalane visigedi yeyĕḍam̐ ganī gāna memaṁdamayyā (||daiva||) puṭṭugadi yĕṁgili pūm̐sina dāsāramu guṭṭu sĕḍadaṁdunānu guṇame tom̐sī vaṭṭiyāsam̐ bŏraledi vaṁtam̐ baḍi tirigedi yĕṭṭu vegiṁcham̐gavachchu nemaṁdamayyā (||daiva||) nikkisūside nĕruga niddiriṁchide marabu makkaḽiṁchinabadugu maṁchidai tom̐sī mikkili śhrīveṁkaḍeśha mīgu nenu śharaṇaṁṭe yĕkkuvāya nābadavi yemaṁdamayyā