Title (Indic)దైవమా నన్నిందులో తగు మానిసిఁగాఁ జేసి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) దైవమా నన్నిందులో తగు మానిసిఁగాఁ జేసి యీవల రక్షించే మేలు యిది చాలదా (॥దైవవ॥) అవ్వలఁ దిరిపెములై అంగలార్చే జీవులలో యెవ్వరిఁ బోలుదు నే నెంచి చూచితే రవ్వగాఁ గ్రిమికీటాలై రమియించే జంతువులలో యెవ్విధి నే సరి గాక యెంతవాఁడ నేను (॥దైవవ॥) పాపము సేసి నరకబాధలఁ బడే వారిలో యేపున నన్నుఁ జూచితే యే నేమి బాఁతి పై పైనజ్ఞానపు పశుపక్షిమృగాలలో తోపునూకుడే కాక దొరనా నేను (॥దైవవ॥) యేమిటివాఁడనై నిన్ను ఇంకా నేఁ గొసరుదు పామరుని నన్నింత పాలించితి యేమని కొనియాడుదు యే నిన్ను శ్రీవేంకటేశ ఆమంచి నీ దాసులలో ఆరుహమా నేను English(||pallavi||) daivamā nanniṁdulo tagu mānisim̐gām̐ jesi yīvala rakṣhiṁche melu yidi sāladā (||daivava||) avvalam̐ diribĕmulai aṁgalārse jīvulalo yĕvvarim̐ boludu ne nĕṁchi sūside ravvagām̐ grimigīḍālai ramiyiṁche jaṁtuvulalo yĕvvidhi ne sari gāga yĕṁtavām̐ḍa nenu (||daivava||) pābamu sesi naragabādhalam̐ baḍe vārilo yebuna nannum̐ jūside ye nemi bām̐ti pai painajñānabu paśhubakṣhimṛgālalo tobunūguḍe kāga dŏranā nenu (||daivava||) yemiḍivām̐ḍanai ninnu iṁkā nem̐ gŏsarudu pāmaruni nanniṁta pāliṁchidi yemani kŏniyāḍudu ye ninnu śhrīveṁkaḍeśha āmaṁchi nī dāsulalo āruhamā nenu