Title (Indic)దైవమ నీవే యిఁక దరి చేరుతువుఁ గాక WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) దైవమ నీవే యిఁక దరి చేరుతువుఁ గాక జీవుల వసము గాదు చిక్కిరి లోలోననే (॥దైవ॥) పుట్టుట సహజ మిది పొదలే జీవుల కెల్ల గట్టిగా జగమునందు కలకాలము నట్టేటి వరదవలె నానాటి నీ మాయ కొట్టుక పారఁగఁజొచ్చె కూడిన విజ్ఞానము (॥దైవ॥) పాపమే సహజము బద్ధసంసారుల కెల్ల కాఁపురపు విధులలో కలకాలము తేపలేని సముద్రము తెరఁగున కర్మమెల్లా మాపురేపు ముంచఁజొచ్చె మతిలోని ధైర్యము (॥దైవ॥) లంపటమే సహజము లలి దేహధారులకు గంపమోపుకోరికెల కలకాలము యింపుల శ్రీవేంకటేశ ఇదె నీ దాసులని పంపుసేసి బ్రదికించె ప్రపన్నసుగతి English(||pallavi||) daivama nīve yim̐ka dari seruduvum̐ gāga jīvula vasamu gādu sikkiri lolonane (||daiva||) puṭṭuḍa sahaja midi pŏdale jīvula kĕlla gaṭṭigā jagamunaṁdu kalagālamu naṭṭeḍi varadavalĕ nānāḍi nī māya kŏṭṭuga pāram̐gam̐jŏchchĕ kūḍina vijñānamu (||daiva||) pābame sahajamu baddhasaṁsārula kĕlla kām̐purabu vidhulalo kalagālamu tebaleni samudramu tĕram̐guna karmamĕllā māburebu muṁcham̐jŏchchĕ madiloni dhairyamu (||daiva||) laṁpaḍame sahajamu lali dehadhārulagu gaṁpamobugorigĕla kalagālamu yiṁpula śhrīveṁkaḍeśha idĕ nī dāsulani paṁpusesi bradigiṁchĕ prabannasugadi