Title (Indic)దైవమ నీవే గతి మాతప్పులు పనిలేదు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) దైవమ నీవే గతి మాతప్పులు పనిలేదు శ్రీవల్లభుడవు నీవే చేకొని కావఁగదే (॥దైవ॥) జనని నీమాయా జనకుఁడవు నీవు జనులము నేమిందర మొకసంతతిబిడ్డలము వొనరెడి దినభోగములు వూరేటిచనుబాలు మునుకొను మానడవళ్లివి ముద్దులు మీ కివివో (॥దైవ॥) ధర బశుపక్షిమృగాదులు తగ తోఁబుట్టుగులు వురుటగు మాదేహంబులు వుయ్యలతొట్టెలలు మరిగినసంసారము బొమ్మరిండ్లయాట లివి నిరతి మాయజ్ఞానంబు నీకు నవ్వులయ్యా (॥దైవ॥) చావులుఁ బుట్టుగు లాడెడిసరి దాగిలిముచ్చిములు భావపుటారంభంబులు బాలలీలగతులు కైవశమందఁగ శ్రీవేంకటపతి నీదాస్యం బిది మావంటివారికెల్లను నీమన్ననలాలనలు English(||pallavi||) daivama nīve gadi mādappulu paniledu śhrīvallabhuḍavu nīve segŏni kāvam̐gade (||daiva||) janani nīmāyā janagum̐ḍavu nīvu janulamu nemiṁdara mŏgasaṁtadibiḍḍalamu vŏnarĕḍi dinabhogamulu vūreḍisanubālu munugŏnu mānaḍavaḽlivi muddulu mī kivivo (||daiva||) dhara baśhubakṣhimṛgādulu taga tom̐buṭṭugulu vuruḍagu mādehaṁbulu vuyyaladŏṭṭĕlalu mariginasaṁsāramu bŏmmariṁḍlayāḍa livi niradi māyajñānaṁbu nīgu navvulayyā (||daiva||) sāvulum̐ buṭṭugu lāḍĕḍisari dāgilimuchchimulu bhāvabuḍāraṁbhaṁbulu bālalīlagadulu kaivaśhamaṁdam̐ga śhrīveṁkaḍabadi nīdāsyaṁ bidi māvaṁṭivārigĕllanu nīmannanalālanalu