Title (Indic)దైవకృత మెవ్వరికిఁ దప్పింపరాదనుచు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) దైవకృత మెవ్వరికిఁ దప్పింపరాదనుచు భావించి జనులాడు పలుకు నిజమాయ (॥దైవ॥) కందునకుఁ బెడఁబాసి చందురుఁడింతి ముఖ- చందురుఁడైన నది అందును గలిగె కందువగు చెలినొసలి కస్తూరితిలకమను - కందు ముఖచంద్రునకుఁ గడునందమాయ (॥దైవ॥) జలజములు శశిచేతనులికి యీ కాంతకుచ- జలజంబులైన నది సరుసనే కలిగె లలితమగు ప్రాణవల్లభుని సురతాంకమున విలువ సేయఁగరాని విదియచందురులు (॥దైవ॥) తీగె బహుజలములకుఁ దెమలి కామిని మేనుఁ- దీగె యయ్యిన నదియుఁ దిరుగ మరి కలిగె ఈ గతులఁ దిరువేంకటేశ్వరుని సమసురత- యోగంబువలన ఘర్మోదకశ్రీలు English(||pallavi||) daivakṛta mĕvvarigim̐ dappiṁparādanusu bhāviṁchi janulāḍu palugu nijamāya (||daiva||) kaṁdunagum̐ bĕḍam̐bāsi saṁdurum̐ḍiṁti mukha- saṁdurum̐ḍaina nadi aṁdunu galigĕ kaṁduvagu sĕlinŏsali kastūridilagamanu - kaṁdu mukhasaṁdrunagum̐ gaḍunaṁdamāya (||daiva||) jalajamulu śhaśhisedanuligi yī kāṁtagusa- jalajaṁbulaina nadi sarusane kaligĕ lalidamagu prāṇavallabhuni suradāṁkamuna viluva seyam̐garāni vidiyasaṁdurulu (||daiva||) tīgĕ bahujalamulagum̐ dĕmali kāmini menum̐- dīgĕ yayyina nadiyum̐ diruga mari kaligĕ ī gadulam̐ diruveṁkaḍeśhvaruni samasurada- yogaṁbuvalana gharmodagaśhrīlu