Title (Indic)దగ్గరితే వలపులు తలకెక్కును WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) దగ్గరితే వలపులు తలకెక్కును సిగ్గువడ కిఁక నేమి చెప్పేమయ్యా నీకును (॥దగ్గ॥) మరునిపాపమె కాదు మాఁకులపై ననలకు వరుస విరహులంటే వాండ్లెక్కును గరిమ నంతటిలోనఁ గలసితే నిద్దరికి తొరలి పువ్వులవంక తుంగ దలకెక్కును (॥దగ్గ॥) చందురు నేరమె కాదు సరసాన నలిగిన విందువంటివెన్నెలకు వేండ్లెక్కును చందమై అంతటిలోనే సంతమైతే వెన్నెలతోఁ నంది సేమంతిపై మంచు అంగముల కెక్కును (॥దగ్గ॥) చల్లగాలితప్పు గాదు జంట వాసి వుండితేను పెల్లుఁజిలుకలకైనా బీర మెక్కును యెల్లగా శ్రీ వేంకటేశ యిద్దరముఁ గూడితిమి మొల్లపు మనమాటలు ముద్దులకు నెక్కును English(||pallavi||) daggaride valabulu talagĕkkunu sigguvaḍa kim̐ka nemi sĕppemayyā nīgunu (||dagga||) marunibābamĕ kādu mām̐kulabai nanalagu varusa virahulaṁṭe vāṁḍlĕkkunu garima naṁtaḍilonam̐ galaside niddarigi tŏrali puvvulavaṁka tuṁga dalagĕkkunu (||dagga||) saṁduru neramĕ kādu sarasāna naligina viṁduvaṁṭivĕnnĕlagu veṁḍlĕkkunu saṁdamai aṁtaḍilone saṁtamaide vĕnnĕladom̐ naṁdi semaṁtibai maṁchu aṁgamula kĕkkunu (||dagga||) sallagālidappu gādu jaṁṭa vāsi vuṁḍidenu pĕllum̐jilugalagainā bīra mĕkkunu yĕllagā śhrī veṁkaḍeśha yiddaramum̐ gūḍidimi mŏllabu manamāḍalu muddulagu nĕkkunu