Title (Indic)దగ్గరితె మొగచాటు దువ్వుల నుంటేఁ జవి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) దగ్గరితె మొగచాటు దువ్వుల నుంటేఁ జవి నిగ్గుల యీరెండూను నీవొళ్లనే కంటినే (॥దగ్గ॥) చెలియ పతిఁ గానక చింతతో నుండి ఆతఁడే పిలువఁగా యిప్పుడైతే బిగిసేవే కలయ నంటా దూరి గక్కనఁ జెయి వట్టితే మొలకనవ్వులతోడ ములిగేవే (॥దగ్గ॥) అప్పుడైతే యెడమాట లాడించి నాయకుఁడు తప్పక చూచితే నిట్టె తల వంచేవే వుప్పతించి దూరఁగగానె వొద్దఁ గూచుండి నాతఁడు పిప్పిగట్టే సిగ్గులతోఁ బెనఁగేవే (॥దగ్గ॥) చిత్తములోఁ గోరినట్టి శ్రీవెంకటేశ్వరుఁడు అత్తి నిన్నుఁ గూడితేనె అలసేవే పొత్తుల మోవితేనెతీపుల సోకించె నితఁడు బత్తి సేయఁగా నీవు భ్రమసేవే English(||pallavi||) daggaridĕ mŏgasāḍu duvvula nuṁṭem̐ javi niggula yīrĕṁḍūnu nīvŏḽlane kaṁṭine (||dagga||) sĕliya padim̐ gānaga siṁtado nuṁḍi ādam̐ḍe piluvam̐gā yippuḍaide bigiseve kalaya naṁṭā dūri gakkanam̐ jĕyi vaṭṭide mŏlaganavvuladoḍa muligeve (||dagga||) appuḍaide yĕḍamāḍa lāḍiṁchi nāyagum̐ḍu tappaga sūside niṭṭĕ tala vaṁcheve vuppadiṁchi dūram̐gagānĕ vŏddam̐ gūsuṁḍi nādam̐ḍu pippigaṭṭe sigguladom̐ bĕnam̐geve (||dagga||) sittamulom̐ gorinaṭṭi śhrīvĕṁkaḍeśhvarum̐ḍu atti ninnum̐ gūḍidenĕ alaseve pŏttula movidenĕdībula sogiṁchĕ nidam̐ḍu batti seyam̐gā nīvu bhramaseve