Title (Indic)దగ్గరి కూడుటకంటె దవ్వులపొందే మేలు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) దగ్గరి కూడుటకంటె దవ్వులపొందే మేలు సిగ్గుతో నున్నది చెలి చిత్త మిఁక ననవే (॥॥) చి త్తమును నీరుచేసె చిగిరింపించెఁ గోరిక వుత్తలపు విరహగ్ని వొప్పదా యేమి హత్తి తనపొఁదైతే నంగనమర్మము గాఁడి వత్తివలె వాడించె వడచల్లీ నిదివో (॥॥) తలఁపించెఁ దనరూపు తమకము పెడరేఁచె వొలసి చెక్కిటిచేయి వొప్పదా యేమి బలిమిఁ దనకాఁగిలి పడఁతిని భ్రమయించి నిలువెల్లా మఱపించె నేర మిందుఁ గలిగె (॥॥) తఱవు రతికి రేఁచె తనువెల్లా నెచ్చరించె వొఱపైనకొనగోరు వొప్పదా యేమి గుఱి శ్రీవేంకటేశుఁడు కూడినకూటములయితే మఱవనీక సతికి మరులాయ ననవే English(||pallavi||) daggari kūḍuḍagaṁṭĕ davvulabŏṁde melu siggudo nunnadi sĕli sitta mim̐ka nanave (||||) si ttamunu nīrusesĕ sigiriṁpiṁchĕm̐ goriga vuttalabu virahagni vŏppadā yemi hatti tanabŏm̐daide naṁganamarmamu gām̐ḍi vattivalĕ vāḍiṁchĕ vaḍasallī nidivo (||||) talam̐piṁchĕm̐ danarūbu tamagamu pĕḍarem̐sĕ vŏlasi sĕkkiḍiseyi vŏppadā yemi balimim̐ danagām̐gili paḍam̐tini bhramayiṁchi niluvĕllā maṟabiṁchĕ nera miṁdum̐ galigĕ (||||) taṟavu radigi rem̐sĕ tanuvĕllā nĕchchariṁchĕ vŏṟabainagŏnagoru vŏppadā yemi guṟi śhrīveṁkaḍeśhum̐ḍu kūḍinagūḍamulayide maṟavanīga sadigi marulāya nanave