Title (Indic)దగ్గరగ రాదు మరి దగ్గరకుండగ రాదు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) దగ్గరగ రాదు మరి దగ్గరకుండగ రాదు యెగ్గులాయ జవ్వనము యిఁకనేఁటికే (॥దగ్గ॥) చేరి వానిరూపు చూచి జిగి సంతోసించేనంటే సారె నాకన్నులనీరు సంగరమాయ ఆరయ వానితో మాటలాడి చొక్కేనంటేను దూరేనానవ్వులే నాకుఁ దొడసాయెనే (॥దగ్గ॥) మునప వానింటికేఁగి ముచ్చటఁ బాసేనంటే- ననువైనమరపులే అడ్డమాయెనే తనివోక వానిరతి తలపోసివుండేనంటే కొనసాగి కోరిక పైకొసరాయెనే (॥దగ్గ॥) గక్కన వానిమేను కాఁగిలించి పట్టేనంటే పక్కన నాసిగ్గులు దెప్పరమాయెనే ఇక్కువ శ్రీవేంకటేశు నిట్టె నేఁ గూడితిని దక్కిన వాని మన్నన తలకూడెనే English(||pallavi||) daggaraga rādu mari daggaraguṁḍaga rādu yĕggulāya javvanamu yim̐kanem̐ṭige (||dagga||) seri vānirūbu sūsi jigi saṁtosiṁchenaṁṭe sārĕ nāgannulanīru saṁgaramāya āraya vānido māḍalāḍi sŏkkenaṁṭenu dūrenānavvule nāgum̐ dŏḍasāyĕne (||dagga||) munaba vāniṁṭigem̐gi muchchaḍam̐ bāsenaṁṭe- nanuvainamarabule aḍḍamāyĕne tanivoga vāniradi talabosivuṁḍenaṁṭe kŏnasāgi koriga paigŏsarāyĕne (||dagga||) gakkana vānimenu kām̐giliṁchi paṭṭenaṁṭe pakkana nāsiggulu dĕpparamāyĕne ikkuva śhrīveṁkaḍeśhu niṭṭĕ nem̐ gūḍidini dakkina vāni mannana talagūḍĕne