Title (Indic)దగ్గర నున్నా నతఁడు తానె యెరుఁగును WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) దగ్గర నున్నా నతఁడు తానె యెరుఁగును వెగ్గళించకురె మీరు విచారించె నన్నియు (॥దగ్గర॥) ఆస పడినట్టివాఁడు ఆయములె అంటుఁ గాని వోసరించి గుట్టుతోడ నూరకుండఁడు వాసితో నే నుండగానె వల పల్లా గాన వచ్చీ వేరించకురే మీరు విచారించె నన్నియు (॥దగ్గర॥) సత మైనయట్టివాడు చనవులె యించు గాని రతికి నెక్కక వేరె రవ్వ నేయడు తతి దప్పకుండఁగానె తగ వెల్లా నీడేరీ వెత సేయకురె మీరు విచారించె నిన్నయు (॥దగ్గర॥) చెక్కు నొక్కినట్టివాడు చెప్పినట్టె సేసుఁ గాని తక్కించి వేరె తాను దమకించడు యిక్కు వెరిగి శ్రీవెంకటేశు డిట్టె కూడె నన్ను వెక్కసము లాడకురె విచారించె నన్నియును English(||pallavi||) daggara nunnā nadam̐ḍu tānĕ yĕrum̐gunu vĕggaḽiṁchagurĕ mīru visāriṁchĕ nanniyu (||daggara||) āsa paḍinaṭṭivām̐ḍu āyamulĕ aṁṭum̐ gāni vosariṁchi guṭṭudoḍa nūraguṁḍam̐ḍu vāsido ne nuṁḍagānĕ vala pallā gāna vachchī veriṁchagure mīru visāriṁchĕ nanniyu (||daggara||) sada mainayaṭṭivāḍu sanavulĕ yiṁchu gāni radigi nĕkkaga verĕ ravva neyaḍu tadi dappaguṁḍam̐gānĕ taga vĕllā nīḍerī vĕda seyagurĕ mīru visāriṁchĕ ninnayu (||daggara||) sĕkku nŏkkinaṭṭivāḍu sĕppinaṭṭĕ sesum̐ gāni takkiṁchi verĕ tānu damagiṁchaḍu yikku vĕrigi śhrīvĕṁkaḍeśhu ḍiṭṭĕ kūḍĕ nannu vĕkkasamu lāḍagurĕ visāriṁchĕ nanniyunu