Title (Indic)దగనివాఁడవా నీవు నంటునను వద్దనుండి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) దగనివాఁడవా నీవు నంటునను వద్దనుండి మొగినే గిలిగించని మోస మింతే కాక (॥నగని॥) తలఁచని వాఁడవా నీ తలఁపులో నడ్డమై నిలుచుండ నిది నా నేరమే కాక పలుకనివాఁడవా నీ పలికెడివేళ నేను కొలువునఁ గాచుక వూఁకొన నైతిఁ గాకా (॥నగని॥) చూచిచూడనివాఁడవా సొరిది నీ వెందైనా కాచి నే నాడ నుండనికల్లే కాక రాచతనాన నింటికి రానివాఁడవా నీవు ఆచాయ మాయిల్లు గట్ట నైతి నింతెకాక (॥నగని॥) కౌఁగిలించనివాఁడవా కడు నీ చేతుల సంది కౌఁగిన నా మేను లోనుగాదాయెఁ గాక ఆఁగి శ్రీవేంకటేశుడ అంతలో నన్నుఁ గూడితి రాఁగి యిందాఁకా నింత నెఱుఁగనైతిఁ గాకా English(||pallavi||) daganivām̐ḍavā nīvu naṁṭunanu vaddanuṁḍi mŏgine giligiṁchani mosa miṁte kāga (||nagani||) talam̐sani vām̐ḍavā nī talam̐pulo naḍḍamai nilusuṁḍa nidi nā nerame kāga paluganivām̐ḍavā nī paligĕḍiveḽa nenu kŏluvunam̐ gāsuga vūm̐kŏna naidim̐ gāgā (||nagani||) sūsisūḍanivām̐ḍavā sŏridi nī vĕṁdainā kāsi ne nāḍa nuṁḍanigalle kāga rāsadanāna niṁṭigi rānivām̐ḍavā nīvu āsāya māyillu gaṭṭa naidi niṁtĕgāga (||nagani||) kaum̐giliṁchanivām̐ḍavā kaḍu nī sedula saṁdi kaum̐gina nā menu lonugādāyĕm̐ gāga ām̐gi śhrīveṁkaḍeśhuḍa aṁtalo nannum̐ gūḍidi rām̐gi yiṁdām̐kā niṁta nĕṟum̐ganaidim̐ gāgā