Title (Indic)దాసోహమను బుద్ధిఁ దలచరు దానవులు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) దాసోహమను బుద్ధిఁ దలచరు దానవులు యీసులకే పెనఁగేరు యిప్పుడూఁ గొందరు (॥దాసో॥) హరిచక్రము దూషించే యట్టివారే యసురలు అరయఁ దామే దైవమన్నవారు నసురలే ధర నరకాసురుడు తానె దైవమని చెడె యిరవై యిది మానరు యిప్పుడూఁ గొందరు (॥దాసో॥) పురుషోత్తముని పూజ పొంతఁ బోరు అసురలు సరవి విష్ణుని జపించనివారు నసురలే హిరణ్యకశిపుఁడును యీతని నొల్లక చెడె ఇరవై యీతని నొల్ల రిప్పుడూఁ గొందరు (॥దాసో॥) సురలును మునులును శుకాది యోగులును పరమము శ్రీవేంకటపతి యనుచు శరణని బ్రదికేరు సరి నేఁడు వైష్ణవులు యెరపరికానఁ బొయ్యే రిప్పుడూఁ గొందరు English(||pallavi||) dāsohamanu buddhim̐ dalasaru dānavulu yīsulage pĕnam̐geru yippuḍūm̐ gŏṁdaru (||dāso||) harisakramu dūṣhiṁche yaṭṭivāre yasuralu arayam̐ dāme daivamannavāru nasurale dhara naragāsuruḍu tānĕ daivamani sĕḍĕ yiravai yidi mānaru yippuḍūm̐ gŏṁdaru (||dāso||) puruṣhottamuni pūja pŏṁtam̐ boru asuralu saravi viṣhṇuni jabiṁchanivāru nasurale hiraṇyagaśhibum̐ḍunu yīdani nŏllaga sĕḍĕ iravai yīdani nŏlla rippuḍūm̐ gŏṁdaru (||dāso||) suralunu munulunu śhugādi yogulunu paramamu śhrīveṁkaḍabadi yanusu śharaṇani bradigeru sari nem̐ḍu vaiṣhṇavulu yĕrabarigānam̐ bŏyye rippuḍūm̐ gŏṁdaru