Title (Indic)దానికేమి దోసము తప్పు లెంచఁ జెల్లదు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) దానికేమి దోసము తప్పు లెంచఁ జెల్లదు అనుకొన్న మగవాని కాదరించవలయు (॥దాని॥) మనసులు సోదింతురు మచ్చికలు చూపుదురు కనుసన్న గావింతురు కాఁక సేతురు గునుతురు సొలతురు గుట్టు దెలుసుకొందుకు వనితలు పతిమీఁద వలఁపు చల్లుదురు (॥దాని॥) ఆసలెల్లా రేఁతురు ఆయము లంటుదురు బాస సేయించుకొందురు భ్రమఇంతురు పాసివుండ రొరతురు పైకొని పెనఁగుదురు వాసి నింతు రిట్లానే వలపు చల్లుదురు (॥దాని॥) కడు సేవలు సేతురు కాఁగిటఁ గూడుదురు బడివాయకుండుదురు పైకొందురు యెడయక శ్రీవేంకటేశ నన్నుఁ గూడితివి వడి నావలె నిందరు వలపు చల్లుదురు English(||pallavi||) dānigemi dosamu tappu lĕṁcham̐ jĕlladu anugŏnna magavāni kādariṁchavalayu (||dāni||) manasulu sodiṁturu machchigalu sūbuduru kanusanna gāviṁturu kām̐ka seduru gunuduru sŏladuru guṭṭu dĕlusugŏṁdugu vanidalu padimīm̐da valam̐pu salluduru (||dāni||) āsalĕllā rem̐turu āyamu laṁṭuduru bāsa seyiṁchugŏṁduru bhrama̮iṁturu pāsivuṁḍa rŏraduru paigŏni pĕnam̐guduru vāsi niṁtu riṭlāne valabu salluduru (||dāni||) kaḍu sevalu seduru kām̐giḍam̐ gūḍuduru baḍivāyaguṁḍuduru paigŏṁduru yĕḍayaga śhrīveṁkaḍeśha nannum̐ gūḍidivi vaḍi nāvalĕ niṁdaru valabu salluduru