Title (Indic)దాని సాహసము మేలు తరవాత నీవు మేలు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) దాని సాహసము మేలు తరవాత నీవు మేలు పూనిన యారడికి నిన్నొడి గట్టించినది (॥దాని॥) రవ్వగా మే నెల్లా జీరలుగాఁ జేయించుక మవ్వపు నాయెదుట నీవు మలసేవు నవ్వుల కైనాను నామాఁట మీరనినిన్ను యెవ్వతెరా నిన్ను నింతగాఁ జేసినది (॥దాని॥) చిగురు నీమోవి యెల్లా చిల్లులుగాఁ జేయించుక వెగటుగా నాయెదుట విఱ్ఱవీఁగేవు తగవుల కైనా జివగాఁటని నిన్నుఁ దెచ్చి జగ నీపై యింత సేసి చలి వాపెను (॥దాని॥) చేవ దేర నీతురుము చిక్కువడఁ జేయించుక శ్రీవెంకటనాథ కడుఁ జెలఁగేవు యేవేళ నన్నుఁబాయక యెనసి వుండితినిన్ను యీవేళఁ జెనకుచు యెమ్మెలు సేసినది English(||pallavi||) dāni sāhasamu melu taravāda nīvu melu pūnina yāraḍigi ninnŏḍi gaṭṭiṁchinadi (||dāni||) ravvagā me nĕllā jīralugām̐ jeyiṁchuga mavvabu nāyĕduḍa nīvu malasevu navvula kainānu nāmām̐ṭa mīranininnu yĕvvadĕrā ninnu niṁtagām̐ jesinadi (||dāni||) siguru nīmovi yĕllā sillulugām̐ jeyiṁchuga vĕgaḍugā nāyĕduḍa viṭravīm̐gevu tagavula kainā jivagām̐ṭani ninnum̐ dĕchchi jaga nībai yiṁta sesi sali vābĕnu (||dāni||) seva dera nīdurumu sikkuvaḍam̐ jeyiṁchuga śhrīvĕṁkaḍanātha kaḍum̐ jĕlam̐gevu yeveḽa nannum̐bāyaga yĕnasi vuṁḍidininnu yīveḽam̐ jĕnagusu yĕmmĕlu sesinadi