Title (Indic)దాఁచుకో నీపాదాలకుఁ దగ నేఁ జేసిన పూజలివి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) దాఁచుకో నీపాదాలకుఁ దగ నేఁ జేసిన పూజలివి పూఁచి నీ కీరితిరూపపుష్పము లివియయ్యా (॥దాఁచు॥) వొక్క సంకీర్తనే చాలు వొద్దికై మమ్ము రక్షించఁగ తక్కినవి భండారాన దాఁచివుండనీ వెక్కసమగు నీ నామము వెల సులభము ఫలమధికము దిక్కై నన్నేలితివిఁక నవి తీరని నా ధనమయ్యా (॥దాఁచు॥) నా నాలికపైనుండి నానా సంకీర్తనలు పూని నాచే నిన్నుఁ బొగడించితివి వేనామాల వెన్నుఁడా వినుతించ నెంతవాఁడ కానిమ్మని నాకీ పుణ్యము గట్టితి వింతేయయ్యా (॥దాఁచు॥) యీమాఁట గర్వముగాదు నీమహిమే కొనియాడితిఁ గాని చేముంచి నా స్వాతంత్ర్యము చెప్పినవాడఁ గాఁను నేమానఁ బాడేవాఁడను నేరములెంచకుమీ శ్రీమాధవ నే నీ దాసుఁడ శ్రీవేంకటేశుఁడవయ్యా English(||pallavi||) dām̐sugo nībādālagum̐ daga nem̐ jesina pūjalivi pūm̐si nī kīridirūbabuṣhpamu liviyayyā (||dām̐su||) vŏkka saṁkīrdane sālu vŏddigai mammu rakṣhiṁcham̐ga takkinavi bhaṁḍārāna dām̐sivuṁḍanī vĕkkasamagu nī nāmamu vĕla sulabhamu phalamadhigamu dikkai nannelidivim̐ka navi tīrani nā dhanamayyā (||dām̐su||) nā nāligabainuṁḍi nānā saṁkīrdanalu pūni nāse ninnum̐ bŏgaḍiṁchidivi venāmāla vĕnnum̐ḍā vinudiṁcha nĕṁtavām̐ḍa kānimmani nāgī puṇyamu gaṭṭidi viṁteyayyā (||dām̐su||) yīmām̐ṭa garvamugādu nīmahime kŏniyāḍidim̐ gāni semuṁchi nā svādaṁtryamu sĕppinavāḍam̐ gām̐nu nemānam̐ bāḍevām̐ḍanu neramulĕṁchagumī śhrīmādhava ne nī dāsum̐ḍa śhrīveṁkaḍeśhum̐ḍavayyā