Title (Indic)దాఁచినవాఁడే యెఱుఁగు ధనము గుఱుతు నాకు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) దాఁచినవాఁడే యెఱుఁగు ధనము గుఱుతు నాకు పూఁచి నీవు చెప్పితేను పొంచి వినే నిఁకను (॥దాఁచి॥) మొక్కితి నప్పుడే నీకు మోహము రెట్టించనా చెక్కులేల నొక్కేవు చేరి యందుకు నిక్కి నీలోనికడమ నీకే తెలుఁసుగాక ఇక్కువలలోని యర్తాఁ లెఱుఁగ నావశమా (॥దాఁచి॥) వీడెమిచ్చితి నాడనే వేవేలుచందముల కూడి యేలకాఁగిలించి కుచ్చియెత్తేవు నీడ నీవు సేసేచేఁత నీకే తెలుసుఁగాక వేడుకతో నవి నేను విచ్చి చెప్పఁగలనా (॥దాఁచి॥) పాదాలొత్తితి నేను పంతపు శ్రీవేంకటేశ ఆదిఁ గూడి తలమేల్మంగందురంటాను నీదయ నాపైఁ బెట్టేది నీకే తెలుసుఁ గాక మేదినిలో నింతంతని మెచ్చ నాకు నలవా English(||pallavi||) dām̐sinavām̐ḍe yĕṟum̐gu dhanamu guṟudu nāgu pūm̐si nīvu sĕppidenu pŏṁchi vine nim̐kanu (||dām̐si||) mŏkkidi nappuḍe nīgu mohamu rĕṭṭiṁchanā sĕkkulela nŏkkevu seri yaṁdugu nikki nīlonigaḍama nīge tĕlum̐sugāga ikkuvalaloni yardām̐ lĕṟum̐ga nāvaśhamā (||dām̐si||) vīḍĕmichchidi nāḍane vevelusaṁdamula kūḍi yelagām̐giliṁchi kuchchiyĕttevu nīḍa nīvu sesesem̐ta nīge tĕlusum̐gāga veḍugado navi nenu vichchi sĕppam̐galanā (||dām̐si||) pādālŏttidi nenu paṁtabu śhrīveṁkaḍeśha ādim̐ gūḍi talamelmaṁgaṁduraṁṭānu nīdaya nābaim̐ bĕṭṭedi nīge tĕlusum̐ gāga medinilo niṁtaṁtani mĕchcha nāgu nalavā