Title (Indic)భోగీంద్రులును మీరుఁ బోయి రండు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) భోగీంద్రులును మీరుఁ బోయి రండు వేగన మీఁదటి విభవాలకు (॥భోగీం॥) హరుఁడ పోయిరా అజుఁడ నీవును బోయి తిరిగిరా మీఁదటి తిరుణాళ్ళకు సురలు మునులును భూసురులుఁబోయి రండు అరవిరి నిన్నాళ్ళు నలసితిరి (॥భోగీం॥) జముఁడ పోయిరా శశియు నీవును బోయి సుముఖుఁడవై రా సురలఁ గూడి గుములై దిక్పతులు దిక్కులకుఁ బోయి రండు ప్రమదాన నిన్నాళ్ళు బడలితిరి (॥భోగీం॥) నారద సనకసనందనాదులు భూరి విభవములఁ బోయిరండు దూరముగాఁ బోకిట్టే తొరలి వేంకటగిరిఁ జేరి నన్నిట్లనే సేవించుఁడీ English(||pallavi||) bhogīṁdrulunu mīrum̐ boyi raṁḍu vegana mīm̐daḍi vibhavālagu (||bhogīṁ||) harum̐ḍa poyirā ajum̐ḍa nīvunu boyi tirigirā mīm̐daḍi tiruṇāḽḽagu suralu munulunu bhūsurulum̐boyi raṁḍu araviri ninnāḽḽu nalasidiri (||bhogīṁ||) jamum̐ḍa poyirā śhaśhiyu nīvunu boyi sumukhum̐ḍavai rā suralam̐ gūḍi gumulai dikpadulu dikkulagum̐ boyi raṁḍu pramadāna ninnāḽḽu baḍalidiri (||bhogīṁ||) nārada sanagasanaṁdanādulu bhūri vibhavamulam̐ boyiraṁḍu dūramugām̐ bogiṭṭe tŏrali veṁkaḍagirim̐ jeri nanniṭlane seviṁchum̐ḍī