Title (Indic)బహుకర్మభోగంపు పనులెల్ల నిట్లనే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) బహుకర్మభోగంపు పనులెల్ల నిట్లనే యిహసుఖంబిందరికి నెట్లనో కాని (॥బహు॥) మెలుఁత విభుఁ బాసియును మితిలేని వేదనల- నలరి యాతనిఁగూడు నభిరతుల నలసె అలిగినను గూడినను కలిగె వలపులు దనకు- నెలమిఁ దనసుఖములిఁక నెప్పుడో కాని (॥బహు॥) ఉడుగని వియోగాగ్ని నూర్పు గడు వేఁడాయ కడు రతులతో నూర్పు గాఁగి వేఁడాయ కడఁగిననుతాపంబె కప్పె మై తాపంబె యెడలేని తమి యింత నెప్పుడో కాని (॥బహు॥) తిరువేంకటాచలాధిపునిఁ బాసినయపుడు తరుణి యాతనినిపుడు తగఁ గూడినపుడు పరవశము దఱచాయ పైపైనె ఘమమాయ యిరవైన యెరుకలిఁక నెప్పుడో కాని English(||pallavi||) bahugarmabhogaṁpu panulĕlla niṭlane yihasukhaṁbiṁdarigi nĕṭlano kāni (||bahu||) mĕlum̐ta vibhum̐ bāsiyunu midileni vedanala- nalari yādanim̐gūḍu nabhiradula nalasĕ aliginanu gūḍinanu kaligĕ valabulu danagu- nĕlamim̐ danasukhamulim̐ka nĕppuḍo kāni (||bahu||) uḍugani viyogāgni nūrbu gaḍu vem̐ḍāya kaḍu radulado nūrbu gām̐gi vem̐ḍāya kaḍam̐ginanudābaṁbĕ kappĕ mai tābaṁbĕ yĕḍaleni tami yiṁta nĕppuḍo kāni (||bahu||) tiruveṁkaḍāsalādhibunim̐ bāsinayabuḍu taruṇi yādaninibuḍu tagam̐ gūḍinabuḍu paravaśhamu daṟasāya paibainĕ ghamamāya yiravaina yĕrugalim̐ka nĕppuḍo kāni