Title (Indic)బాపురే యెంతటి జాణ బాలకృష్ణుఁడు చూడఁ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) బాపురే యెంతటి జాణ బాలకృష్ణుఁడు చూడఁ బాపనివలె నున్నాఁడు బలరామకృష్ణుఁడు (॥బాపరే॥) వొంటి గోపికలచన్ను లుట్లపై కుండ లంటా అంటుచుఁ జేతులు చాఁచీ నదే కృష్ణుఁడు వెంటనే ఆధరములు వెస మోవిపండ్లంటా గొంటరియై అడిగీని గోవిందకృష్ణుఁడు (॥బాపరే॥) సతుల పెద్ద కొప్పులు చక్కిలాలగంప లంటా బతిమాలి వేఁడీ నప్పటిఁ గృష్ణుఁడు చతురతఁ బిరుఁదులు చక్కెరదీబ లంటా తతిగొని యంటీని దామోదరకృష్ణుఁడు (॥బాపరే॥) అంగనలవొడికట్లు అరఁటిపండ్లంటా సంగతిఁ గౌఁగిలించీ వేసాలకృష్ణుఁడు అంగడి నింతులెల్లాను అలమేలుమంగ యంటా చెంగలించి కూడీని శ్రీవేంకటకృష్ణుఁడు English(||pallavi||) bābure yĕṁtaḍi jāṇa bālakṛṣhṇum̐ḍu sūḍam̐ bābanivalĕ nunnām̐ḍu balarāmakṛṣhṇum̐ḍu (||bābare||) vŏṁṭi gobigalasannu luṭlabai kuṁḍa laṁṭā aṁṭusum̐ jedulu sām̐sī nade kṛṣhṇum̐ḍu vĕṁṭane ādharamulu vĕsa movibaṁḍlaṁṭā gŏṁṭariyai aḍigīni goviṁdakṛṣhṇum̐ḍu (||bābare||) sadula pĕdda kŏppulu sakkilālagaṁpa laṁṭā badimāli vem̐ḍī nappaḍim̐ gṛṣhṇum̐ḍu saduradam̐ birum̐dulu sakkĕradība laṁṭā tadigŏni yaṁṭīni dāmodarakṛṣhṇum̐ḍu (||bābare||) aṁganalavŏḍigaṭlu aram̐ṭibaṁḍlaṁṭā saṁgadim̐ gaum̐giliṁchī vesālakṛṣhṇum̐ḍu aṁgaḍi niṁtulĕllānu alamelumaṁga yaṁṭā sĕṁgaliṁchi kūḍīni śhrīveṁkaḍakṛṣhṇum̐ḍu