Title (Indic)బాపురే వో ప్రాణి బాపురే వో మనసా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) బాపురే వో ప్రాణి బాపురే వో మనసా వో పనస వెందుకైనా నొడఁబడేవు (॥బాపు॥) మురికి దేహమొకటి మోచుక నీ వప్పటిని మురికి దేహసతుల మోవఁగోరే వప్పటిని కరకు హేయము గొంత కడుపున నించుకొని తిరిగి హేయమేకాను(?) తినఁబోయే వప్పటి (॥బాపు॥) పసిఁడి కమ్ముడువోయి పరులఁగొలిచి మరిఁ బసిఁడి సొమ్మంటాఁ బైఁ బెట్టఁ గోరేవు పిసరుఁ బాపపుణ్యాలఁ బెడఁగేలు గట్టించుక విసువక అవియే కావించఁబోయే వప్పటి (॥బాపు॥) పంచభూతములచేతఁ బట్టువడి కమ్మరాను పంచభూతాల దేహుల బంధులంటాఁ దగిలేవు అంచెల శ్రీవేంకటేశుఁ డాతుమలో నున్నవాఁడు యెంచుక తెలిసియును ఇట్టె మరచే వప్పటి English(||pallavi||) bābure vo prāṇi bābure vo manasā vo panasa vĕṁdugainā nŏḍam̐baḍevu (||bābu||) murigi dehamŏgaḍi mosuga nī vappaḍini murigi dehasadula movam̐gore vappaḍini karagu heyamu gŏṁta kaḍubuna niṁchugŏni tirigi heyamegānu(?) tinam̐boye vappaḍi (||bābu||) pasim̐ḍi kammuḍuvoyi parulam̐gŏlisi marim̐ basim̐ḍi sŏmmaṁṭām̐ baim̐ bĕṭṭam̐ gorevu pisarum̐ bābabuṇyālam̐ bĕḍam̐gelu gaṭṭiṁchuga visuvaga aviye kāviṁcham̐boye vappaḍi (||bābu||) paṁchabhūdamulasedam̐ baṭṭuvaḍi kammarānu paṁchabhūdāla dehula baṁdhulaṁṭām̐ dagilevu aṁchĕla śhrīveṁkaḍeśhum̐ ḍādumalo nunnavām̐ḍu yĕṁchuga tĕlisiyunu iṭṭĕ marase vappaḍi