Title (Indic)బాపురే నీమాయ భ్రమయించీ జీవులకు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) బాపురే నీమాయ భ్రమయించీ జీవులకు దాపున నున్నదేకాని దవ్వలకుఁ జొరదు (॥బాపు॥) మోక్షమురుచి గానదు ముందర నుండఁగాను సాక్షియై జగమిది చవి చూపఁగా దీక్షకుఁ జొరదు మరి దేవ నీపై భక్తి లేదు దక్షులై యాలుబిడ్డలు దండనుండఁగాను (॥బాపు॥) జ్ఞానమితవు గాదు సంగడి నుండదుగాన నానాయోనులమేను ననిచుండఁగా ఆనకమై వైరాగ్యమంట దలవాటులేక కానఁబడ కర్మములు గాసిఁ బెట్టఁగాను (॥బాపు॥) మంచిదని నీ తిరుమంత్రము దలఁచుకోదు పంచేంద్రియములాత్మ బలిశుండఁగా యెంచుకొని శ్రీవేంకటేశ నీకే శరణని అంచల నీదాసులైతే నన్నిటా గెలిచిరి English(||pallavi||) bābure nīmāya bhramayiṁchī jīvulagu dābuna nunnadegāni davvalagum̐ jŏradu (||bābu||) mokṣhamurusi gānadu muṁdara nuṁḍam̐gānu sākṣhiyai jagamidi savi sūbam̐gā dīkṣhagum̐ jŏradu mari deva nībai bhakti ledu dakṣhulai yālubiḍḍalu daṁḍanuṁḍam̐gānu (||bābu||) jñānamidavu gādu saṁgaḍi nuṁḍadugāna nānāyonulamenu nanisuṁḍam̐gā ānagamai vairāgyamaṁṭa dalavāḍulega kānam̐baḍa karmamulu gāsim̐ bĕṭṭam̐gānu (||bābu||) maṁchidani nī tirumaṁtramu dalam̐sugodu paṁcheṁdriyamulātma baliśhuṁḍam̐gā yĕṁchugŏni śhrīveṁkaḍeśha nīge śharaṇani aṁchala nīdāsulaide nanniḍā gĕlisiri