Title (Indic)బాపురే నే మెచ్చితిని భాగ్యమాయను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) బాపురే నే మెచ్చితిని భాగ్యమాయను ఆపె భోగించినవి నీకందమాయను (॥బాపు॥) వనిత చెక్కులవెంట వడిసే జవ్వాదినే మినుకై నీమేనెల్లా మెఱుఁగాయను పెనఁగులాడేటివేళ బెరసిన చెమటల పనుపడి నీతమికిఁ బదనాయను (॥బాపు॥) రమణి కొప్పువిరులు రాలి నీపైఁ జిందఁగాను సమరతివెట్ట దీరి చల్లనాయను జమళి సరసమాడ చన్నుల కస్తూరిపూఁత అమరి నీవురమున కడియాలమాయను (॥బాపు॥) పడఁతిమోవితేనెలు పలుమారు నీకియ్యఁగా విడువని నీపొందుకు విందులాయను అడరి శ్రీ వేంకటేశ అట్టె నన్నునేలితివి బడిబడినే మేలు పైకొసరాయను English(||pallavi||) bābure ne mĕchchidini bhāgyamāyanu ābĕ bhogiṁchinavi nīgaṁdamāyanu (||bābu||) vanida sĕkkulavĕṁṭa vaḍise javvādine minugai nīmenĕllā mĕṟum̐gāyanu pĕnam̐gulāḍeḍiveḽa bĕrasina sĕmaḍala panubaḍi nīdamigim̐ badanāyanu (||bābu||) ramaṇi kŏppuvirulu rāli nībaim̐ jiṁdam̐gānu samaradivĕṭṭa dīri sallanāyanu jamaḽi sarasamāḍa sannula kastūribūm̐ta amari nīvuramuna kaḍiyālamāyanu (||bābu||) paḍam̐timovidenĕlu palumāru nīgiyyam̐gā viḍuvani nībŏṁdugu viṁdulāyanu aḍari śhrī veṁkaḍeśha aṭṭĕ nannunelidivi baḍibaḍine melu paigŏsarāyanu