Title (Indic)బాపుబాపు నీవంటి పతికి నిల్లాలనైతి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) బాపుబాపు నీవంటి పతికి నిల్లాలనైతి నీపై వలపే నాకు నిచ్చకల్యాణము (॥బాపు॥) యెంత నోమునోఁచెనో యీచనుఁగొండలు, నేఁడు వంతుల నీకరపల్లవములు ముంచె వింత లెట్టిభాగ్యము గావించెనో చెక్కుటద్దాలు పొంత నీరూపమునీడ పొలయఁగలిగెను (॥బాపు॥) యేమి దపము చేసెనో యీకన్నుఁగలువలు నీముఖచంద్రునిపొందు నెమ్మిఁ గలిగె కామించి యేమి పుణ్యమో కందువనామోవిపండు వోముచు నీమూర్తికి నుపారమాయ (॥బాపు॥) యెన్నటితగులాయమో యీబాహులతలకు వన్నె నీరతి చెమటవాన గలిగె అన్నిటా శ్రీవేంకటేశ అలమేల్మంగను నేను కన్నెనాటనుండి నీతో కాఁపురము గలిగె English(||pallavi||) bābubābu nīvaṁṭi padigi nillālanaidi nībai valabe nāgu nichchagalyāṇamu (||bābu||) yĕṁta nomunom̐sĕno yīsanum̐gŏṁḍalu, nem̐ḍu vaṁtula nīgaraballavamulu muṁchĕ viṁta lĕṭṭibhāgyamu gāviṁchĕno sĕkkuḍaddālu pŏṁta nīrūbamunīḍa pŏlayam̐galigĕnu (||bābu||) yemi dabamu sesĕno yīgannum̐galuvalu nīmukhasaṁdrunibŏṁdu nĕmmim̐ galigĕ kāmiṁchi yemi puṇyamo kaṁduvanāmovibaṁḍu vomusu nīmūrdigi nubāramāya (||bābu||) yĕnnaḍidagulāyamo yībāhuladalagu vannĕ nīradi sĕmaḍavāna galigĕ anniḍā śhrīveṁkaḍeśha alamelmaṁganu nenu kannĕnāḍanuṁḍi nīdo kām̐puramu galigĕ