Title (Indic)బాపుబాపు నాతపసు ఫలియించెను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) బాపుబాపు నాతపసు ఫలియించెను యేపున నీ చెప్పినట్టే యిఁకనుండే నేను (॥బాపు॥) మచ్చరము నాకుఁదీరె మనసెల్ల నొక్కటాయ నచ్చులనాపె నీతో నవ్వఁగాను విచ్చనవిడిఁజలఁగు వెంగెమాడ నిన్నుమఱి యిచ్చకురాలనై నీకు యిఁకనుండే నేను (॥బాపు॥) వేడుకలు నాకుఁబుట్టె వెరపులిన్నియుఁ బాసె కూడా నీతొడపైనాపె కూచుండఁగాను వోడక సిగ్గువిడువు వుల్లసాలాడ నిన్ను యీడనె సతమై నీకు యిఁకనుండే నేను (॥బాపు॥) తారుకాణ నాకువచ్చె దయపుట్టె నాలోన చేరి కౌఁగిలించి యాపె చెనకఁగాను యీరీతి శ్రీవేంకటేశ యిటునన్నుఁ గూడితివి యీరసము మానెఁ బాయకిఁకనుండే నేను English(||pallavi||) bābubābu nādabasu phaliyiṁchĕnu yebuna nī sĕppinaṭṭe yim̐kanuṁḍe nenu (||bābu||) machcharamu nāgum̐dīrĕ manasĕlla nŏkkaḍāya nachchulanābĕ nīdo navvam̐gānu vichchanaviḍim̐jalam̐gu vĕṁgĕmāḍa ninnumaṟi yichchagurālanai nīgu yim̐kanuṁḍe nenu (||bābu||) veḍugalu nāgum̐buṭṭĕ vĕrabulinniyum̐ bāsĕ kūḍā nīdŏḍabainābĕ kūsuṁḍam̐gānu voḍaga sigguviḍuvu vullasālāḍa ninnu yīḍanĕ sadamai nīgu yim̐kanuṁḍe nenu (||bābu||) tārugāṇa nāguvachchĕ dayabuṭṭĕ nālona seri kaum̐giliṁchi yābĕ sĕnagam̐gānu yīrīdi śhrīveṁkaḍeśha yiḍunannum̐ gūḍidivi yīrasamu mānĕm̐ bāyagim̐kanuṁḍe nenu