Title (Indic)బాపు బాపు యిఁక నాకుఁ బరిణామము WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) బాపు బాపు యిఁక నాకుఁ బరిణామము ఆ పనులెల్లా నావి అదియే నా వలపు (॥బాప॥) మంతనాన నీవు నాపె మాటలాడఁగాఁ జూచి చింతలెల్లఁ బాసి యేక చిత్తమాయను వంతులకు నే నీకు వలతునాపెకు నీవు అంతకంటె వలతువు అదియే నావలపు (॥బాప॥) చలివాసి యిద్దరును సరసమాడఁగఁ జూచి బలిమి నాజన్మము సఫలమాయెను అలరి నే నీకు లోను ఆపెకు నీవులోనై అలవాటాయఁ గనక అదియే నావలపు (॥బాప॥) మంచముపై నిద్దర నెమ్మదినుండఁగాఁ జూచి సంచమై నామేనెల్ల చల్లనాయను యెంచఁగ శ్రీవేంకటేశ యిద్దరము నీసొమ్ము అంచెలఁ గూడితిమిదె అదియే నావలపు English(||pallavi||) bābu bābu yim̐ka nāgum̐ bariṇāmamu ā panulĕllā nāvi adiye nā valabu (||bāba||) maṁtanāna nīvu nābĕ māḍalāḍam̐gām̐ jūsi siṁtalĕllam̐ bāsi yega sittamāyanu vaṁtulagu ne nīgu valadunābĕgu nīvu aṁtagaṁṭĕ valaduvu adiye nāvalabu (||bāba||) salivāsi yiddarunu sarasamāḍam̐gam̐ jūsi balimi nājanmamu saphalamāyĕnu alari ne nīgu lonu ābĕgu nīvulonai alavāḍāyam̐ ganaga adiye nāvalabu (||bāba||) maṁchamubai niddara nĕmmadinuṁḍam̐gām̐ jūsi saṁchamai nāmenĕlla sallanāyanu yĕṁcham̐ga śhrīveṁkaḍeśha yiddaramu nīsŏmmu aṁchĕlam̐ gūḍidimidĕ adiye nāvalabu