Title (Indic)బాపు బాపు రాఘవ నీ ప్రతాపమేమని చెప్ప WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) బాపు బాపు రాఘవ నీ ప్రతాపమేమని చెప్ప పైపై నీపేరు విని పారేరు రాకాసులు (॥బాపు॥) వాలినెత్తురు నీటను వాఁడి పదనిచ్చినమ్ము కూలిచె నొక్కమాటునఁ గుంభకర్ణుని యీలకొని మాయామృగ మెమ్ముల నొరసినమ్ము రాలించె నుత్తరగోపురముపై గొడగులు (॥బాపు॥) తొడికి మింటి తాపలు తుంచి దూప (?) దాఁకినమ్ము జడధి మరుదేశాల జల మింకించె యెడయక కౌశికుని యజ్ఞము గాచినమ్ము అడరి రావణుని పూర్ణాహుతిగఁ జేసెను (॥బాపు॥) బెరసి యే పొద్దును నీ పిడికిటిలోనియమ్ము సురల భయముఁ బాపి సూటికెక్కెను ఇరవై శ్రీవేంకటాద్రి నిటు రామచంద్రుఁడవై పరగఁగ నీయమ్ము పగయెల్ల నీఁగెను English(||pallavi||) bābu bābu rāghava nī pradābamemani sĕppa paibai nīberu vini pāreru rāgāsulu (||bābu||) vālinĕtturu nīḍanu vām̐ḍi padanichchinammu kūlisĕ nŏkkamāḍunam̐ guṁbhagarṇuni yīlagŏni māyāmṛga mĕmmula nŏrasinammu rāliṁchĕ nuttaragoburamubai gŏḍagulu (||bābu||) tŏḍigi miṁṭi tābalu tuṁchi dūba (?) dām̐kinammu jaḍadhi marudeśhāla jala miṁkiṁchĕ yĕḍayaga kauśhiguni yajñamu gāsinammu aḍari rāvaṇuni pūrṇāhudigam̐ jesĕnu (||bābu||) bĕrasi ye pŏddunu nī piḍigiḍiloniyammu surala bhayamum̐ bābi sūḍigĕkkĕnu iravai śhrīveṁkaḍādri niḍu rāmasaṁdrum̐ḍavai paragam̐ga nīyammu pagayĕlla nīm̐gĕnu