Title (Indic)బాపు బాపు నేఁ జేసిన భాగ్య మెట్టిదో WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) బాపు బాపు నేఁ జేసిన భాగ్య మెట్టిదో తాపికత్తెఁ జేసి నన్ను దయఁ జూచితివిగా (॥బాపు॥) మనసొక్కటాయ నేఁడు మగువా నీవును రాఁగా యెనసి వుండిన పొందు కిది గురుతు ననిచిన వారము నాకు నీకుఁ బోవునా ఘనమై యెక్కుడు వస్తే కైకొందువుగాక (॥బాపు॥) నమ్మితి నీమాఁటలెల్లా నాయింట నీపెఁ బెట్టఁగా యిమ్ములఁ గొంకుదేరుట కిది గురుతు సమ్మతైన మనలోన సరవులు దప్పీనా వుమ్మడివారు వచ్చితే వూరడింతుగాక (॥బాపు॥) యెక్కువ భూసతిఁ గూడి యిటు నన్ను మన్నించితి విక్కడ శ్రీ సతి వౌట కిది గురుతు దక్కితి శ్రీ వేంకటేశ తప్పులు మనకు లేవు మిక్కటపు యీపెరతి మెత్తువు గాక English(||pallavi||) bābu bābu nem̐ jesina bhāgya mĕṭṭido tābigattĕm̐ jesi nannu dayam̐ jūsidivigā (||bābu||) manasŏkkaḍāya nem̐ḍu maguvā nīvunu rām̐gā yĕnasi vuṁḍina pŏṁdu kidi gurudu nanisina vāramu nāgu nīgum̐ bovunā ghanamai yĕkkuḍu vaste kaigŏṁduvugāga (||bābu||) nammidi nīmām̐ṭalĕllā nāyiṁṭa nībĕm̐ bĕṭṭam̐gā yimmulam̐ gŏṁkuderuḍa kidi gurudu sammadaina manalona saravulu dappīnā vummaḍivāru vachchide vūraḍiṁtugāga (||bābu||) yĕkkuva bhūsadim̐ gūḍi yiḍu nannu manniṁchidi vikkaḍa śhrī sadi vauḍa kidi gurudu dakkidi śhrī veṁkaḍeśha tappulu managu levu mikkaḍabu yībĕradi mĕttuvu gāga