Title (Indic)బాపు బాపు మేలు వొఱపరివౌదువు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) బాపు బాపు మేలు వొఱపరివౌదువు చాపలాన నీవే కడు జాణవు గావోయీ (॥బాప॥) మొగమీకె చూడఁగానే మొనసి వేరొకతెతో నగవులు నవ్వేవు నాలికాఁడవు తగులఁగానే మరి తరితీపు వుట్టించేవు జగములోపల నీవే జాణవు గావోయీ (॥బాప॥) మాటలీకె ఆడఁగానే మగిడి పొరుగాకెను నీటుతోడఁ బిలిచేవు నేరుపరివి గాటాన వలచుండఁగ కాఁకలు గడు రేఁచేవు చాటువగా నీవే కడు జాణవు గావోయీ (॥బాప॥) చేరి యీకెఁ గూడఁగానే చెలిపైఁ జేయి వేసి గారవించేవు శ్రీవేంకటేశుఁడవు యీరీతి నన్నేలి యాపె యెదనుండఁ జొక్కించేవు సారెసారెకును నీవే జాణవు గావోయీ English(||pallavi||) bābu bābu melu vŏṟabarivauduvu sābalāna nīve kaḍu jāṇavu gāvoyī (||bāba||) mŏgamīgĕ sūḍam̐gāne mŏnasi verŏgadĕdo nagavulu navvevu nāligām̐ḍavu tagulam̐gāne mari taridību vuṭṭiṁchevu jagamulobala nīve jāṇavu gāvoyī (||bāba||) māḍalīgĕ āḍam̐gāne magiḍi pŏrugāgĕnu nīḍudoḍam̐ bilisevu nerubarivi gāḍāna valasuṁḍam̐ga kām̐kalu gaḍu rem̐sevu sāḍuvagā nīve kaḍu jāṇavu gāvoyī (||bāba||) seri yīgĕm̐ gūḍam̐gāne sĕlibaim̐ jeyi vesi gāraviṁchevu śhrīveṁkaḍeśhum̐ḍavu yīrīdi nanneli yābĕ yĕdanuṁḍam̐ jŏkkiṁchevu sārĕsārĕgunu nīve jāṇavu gāvoyī