Title (Indic)బాపు బాపు మేలు మేలు పంతగత్తె వౌదువే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) బాపు బాపు మేలు మేలు పంతగత్తె వౌదువే నీ పంతములెల్ల దక్కె నేర మేమి గంటివే (॥బాప॥) చలము మానినఁ గాక సమ్మతింపించవచ్చునా పెలుచుఁదనపు నీతోఁ బెనఁగెఁగాక నిలుచున్నాఁ డాతఁ డదె నే నిన్ను వేఁడుకొనేను పలుకవు నీవైతే ఫల మేమిగంటివే (॥బాప॥) మాటలాడేనంటేఁ గాక మంకు దెలుపవచ్చునా సాటికి బేటికి నిన్ను సాదించెఁగాక గీటీ గోర నతఁడు కేలుచాఁచి తీసే నేను నీటువెట్టుకుందానవు నీ వేమిగంటివే (॥బాప॥) నయముగలితేఁ గాక నాయము చెప్పవచ్చునా దయవుట్టి నేనె నిన్నుఁ దగిలెఁగాక క్రియఁగూడె శ్రీవెంకటగిరిపతి నే మెచ్చితి ప్రియపడే విదె నీవు భేద మేమిగంటివే English(||pallavi||) bābu bābu melu melu paṁtagattĕ vauduve nī paṁtamulĕlla dakkĕ nera memi gaṁṭive (||bāba||) salamu māninam̐ gāga sammadiṁpiṁchavachchunā pĕlusum̐danabu nīdom̐ bĕnam̐gĕm̐gāga nilusunnām̐ ḍādam̐ ḍadĕ ne ninnu vem̐ḍugŏnenu palugavu nīvaide phala memigaṁṭive (||bāba||) māḍalāḍenaṁṭem̐ gāga maṁku dĕlubavachchunā sāḍigi beḍigi ninnu sādiṁchĕm̐gāga gīḍī gora nadam̐ḍu kelusām̐si tīse nenu nīḍuvĕṭṭuguṁdānavu nī vemigaṁṭive (||bāba||) nayamugalidem̐ gāga nāyamu sĕppavachchunā dayavuṭṭi nenĕ ninnum̐ dagilĕm̐gāga kriyam̐gūḍĕ śhrīvĕṁkaḍagiribadi ne mĕchchidi priyabaḍe vidĕ nīvu bheda memigaṁṭive