Title (Indic)అప్పటినేల పిలిచే వాసల నేల పట్టేవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) అప్పటినేల పిలిచే వాసల నేల పట్టేవు వొప్పుగా నీ పనులకే వొడిగట్టుకున్నది (॥అప॥) పలుమరు విడేలిచ్చి పాదొలొత్తె వేగినంతా చెలి యేమిసేయవలెఁ జెప్పవయ్యా వలసినట్టల్లా వీణె వాయించెఁ గొంతవడి తలఁపు నీకెందుపైనొ తతి నీకే తెలుసు (॥అప॥) చేముట్టి సరమాడి సేవసేసె నిందాఁకా యేమనేవు యింకా నానతీవయ్యా కామించినట్టల్లాఁ గతలు చెప్పె నీకు యేమో నీకు నిద్ర రాదు యెఱఁగము నేము (॥అప॥) పక్క నీకుఁ దొడు వండె బడివాయ దెప్పుడును నిక్కి నీకితవైనట్టు నేరుపవయ్యా వెక్కసపలమేలుమంగవిభుఁడ శ్రీవేంకటేశ నెక్కొని పెండ్లాడితివి నీవన్నీ నేరుతువు English(||pallavi||) appaḍinela pilise vāsala nela paṭṭevu vŏppugā nī panulage vŏḍigaṭṭugunnadi (||aba||) palumaru viḍelichchi pādŏlŏttĕ veginaṁtā sĕli yemiseyavalĕm̐ jĕppavayyā valasinaṭṭallā vīṇĕ vāyiṁchĕm̐ gŏṁtavaḍi talam̐pu nīgĕṁdubainŏ tadi nīge tĕlusu (||aba||) semuṭṭi saramāḍi sevasesĕ niṁdām̐kā yemanevu yiṁkā nānadīvayyā kāmiṁchinaṭṭallām̐ gadalu sĕppĕ nīgu yemo nīgu nidra rādu yĕṟam̐gamu nemu (||aba||) pakka nīgum̐ dŏḍu vaṁḍĕ baḍivāya dĕppuḍunu nikki nīgidavainaṭṭu nerubavayyā vĕkkasabalamelumaṁgavibhum̐ḍa śhrīveṁkaḍeśha nĕkkŏni pĕṁḍlāḍidivi nīvannī neruduvu