Title (Indic)అందుకేమి దోసమా అతనితో నిట్లనరే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) అందుకేమి దోసమా అతనితో నిట్లనరే పొఁ(పొం?)దైన నాతోడ బొంకవద్దుగాక (॥అందు॥) పిలచితే దోసమా ప్రియముతో నోరార వలవంతఁ గేఁకరించవద్దుగాక నిలిచితే దోసమా నివ్వెరగుతో నెదుట నలువంకఁ జెలులతో నవ్వవద్దగాక (॥అందు॥) పూఁకొంటే దోసమా వొంటి సుద్దులు చెప్పఁగా వాఁకపుగోళ్లు చిమ్మవద్దుగాక వీఁకఁ బట్టితే దోసమా వేడుకఁ బొందైనవారు సొఁకుచు కెఁగండ్లఁ బారఁజూడవద్దుగాక (॥అందు॥) కూడితేనే దోసమా గుట్టుతో దంపతులకు వాడికసిగ్గులు వడవద్దుగాక యీడనే శ్రీవేంకటేశుఁడింతలోనె నన్నుఁ గూడె యేడనైన మోవిచూపేయెమ్మె వద్దుగాక English(||pallavi||) aṁdugemi dosamā adanido niṭlanare pŏm̐(pŏṁ?)daina nādoḍa bŏṁkavaddugāga (||aṁdu||) pilaside dosamā priyamudo norāra valavaṁtam̐ gem̐kariṁchavaddugāga niliside dosamā nivvĕragudo nĕduḍa naluvaṁkam̐ jĕlulado navvavaddagāga (||aṁdu||) pūm̐kŏṁṭe dosamā vŏṁṭi suddulu sĕppam̐gā vām̐kabugoḽlu simmavaddugāga vīm̐kam̐ baṭṭide dosamā veḍugam̐ bŏṁdainavāru sŏm̐kusu kĕm̐gaṁḍlam̐ bāram̐jūḍavaddugāga (||aṁdu||) kūḍidene dosamā guṭṭudo daṁpadulagu vāḍigasiggulu vaḍavaddugāga yīḍane śhrīveṁkaḍeśhum̐ḍiṁtalonĕ nannum̐ gūḍĕ yeḍanaina movisūbeyĕmmĕ vaddugāga