Title (Indic)అలుకలు చెల్లవు హరి పురుషోత్తమ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) అలుకలు చెల్లవు హరి పురుషోత్తమ నలి నిందిర నీతో నవ్వినది (॥అలు॥) ఆదిలక్షి మోహనకమలంబున వేదమాత నిను వేసినది ఆదెస నీపై నభయహస్తమును సాదరమునఁ గడుఁ జాఁచినది (॥అలు॥) సిరి దనకన్నుల చింతామణులను పొరి నీపై దిగఁబోసినది వరదహస్తమున వలచెయి వట్టుక అరుదుగ విను మాఁటాడించినది (॥అలు॥) జలదికన్య తనసర్వాంగంబులఁ బిలిచి నిన్ను నిటు పెనఁగినది అలముక శ్రీవేంకటాధిప నిను రతి- నెలమి నీవురఁ(రం) బెక్కినది English(||pallavi||) alugalu sĕllavu hari puruṣhottama nali niṁdira nīdo navvinadi (||alu||) ādilakṣhi mohanagamalaṁbuna vedamāda ninu vesinadi ādĕsa nībai nabhayahastamunu sādaramunam̐ gaḍum̐ jām̐sinadi (||alu||) siri danagannula siṁtāmaṇulanu pŏri nībai digam̐bosinadi varadahastamuna valasĕyi vaṭṭuga aruduga vinu mām̐ṭāḍiṁchinadi (||alu||) jaladiganya tanasarvāṁgaṁbulam̐ bilisi ninnu niḍu pĕnam̐ginadi alamuga śhrīveṁkaḍādhiba ninu radi- nĕlami nīvuram̐(raṁ) bĕkkinadi