Title (Indic)అలమేల్మంగవు నీవు అక్కున నుందానవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) అలమేల్మంగవు నీవు అక్కున నుందానవు లలి నీగుణమెఱిఁగి లాలించీఁ గాక (॥అల॥) కొచ్చి కొచ్చి పలుమారుఁ గొసర నేమిటికే మచ్చికతో నాతఁడే మన్నించీఁగాక కచ్చుపెట్టి రతులకుఁ గక్కసించనేఁటికే యిచ్చకము సేయఁగానే యెనసీఁగాక (॥అల॥) విన్నపాలు నేసి సేసి వేసిరించనేఁటికే తన్నుఁదానే నీపై దయదలఁచీఁగాక చన్నుఁ గొండలనే వొత్తి చండిసేయ నేఁటికే యెన్నికతో వేఁడుకొంటే నియ్య కొనీఁగాక (॥అల॥) పిక్కటిల్లఁ జేయివట్టి పెనఁగఁగ నేఁటికే యిక్కడ శ్రీవేంకటేశుఁ డేలీఁగాక తక్క నిన్నుఁ బెండ్లాడీ తమకించ నేఁటికే చక్కఁగా సేవ చేసితే చనవిచ్చీఁగాక English(||pallavi||) alamelmaṁgavu nīvu akkuna nuṁdānavu lali nīguṇamĕṟim̐gi lāliṁchīm̐ gāga (||ala||) kŏchchi kŏchchi palumārum̐ gŏsara nemiḍige machchigado nādam̐ḍe manniṁchīm̐gāga kachchubĕṭṭi radulagum̐ gakkasiṁchanem̐ṭige yichchagamu seyam̐gāne yĕnasīm̐gāga (||ala||) vinnabālu nesi sesi vesiriṁchanem̐ṭige tannum̐dāne nībai dayadalam̐sīm̐gāga sannum̐ gŏṁḍalane vŏtti saṁḍiseya nem̐ṭige yĕnnigado vem̐ḍugŏṁṭe niyya kŏnīm̐gāga (||ala||) pikkaḍillam̐ jeyivaṭṭi pĕnam̐gam̐ga nem̐ṭige yikkaḍa śhrīveṁkaḍeśhum̐ ḍelīm̐gāga takka ninnum̐ bĕṁḍlāḍī tamagiṁcha nem̐ṭige sakkam̐gā seva seside sanavichchīm̐gāga