Title (Indic)అటుగనక నినుఁ దలఁచు కంతట నుండుట మేలు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) అటుగనక నినుఁ దలఁచు కంతట నుండుట మేలు అటుమటము లెందాఁక నంపరా నీవు (॥॥) చెంతల వేరొకతెపై చిత్తము నీకుండఁగా నే యెంతప్రియము చెప్పిన నేమి సెలవు ఇంతట గుట్టున నుండ నెరిఁగేవు గాక నీవే కాంతుఁడ నిద్రించువారికాళ్లు గడుగవశమా (॥॥) అవ్వల నెవ్వతెపసకో అసురుసుకు గాఁగ నిను నవ్వించఁబోవు టిస్సీ నగుఁబాట్లు దవ్వులపొందువులే చవులు దగిలేవు నీవు నను నెవ్వగ నీరువట్టుకును నేయి మందగునా (॥॥) వేరే యేసతినో తలఁచి వేడుకలు చెలఁగఁగ కూరిమి నేఁ బైకొనుట కూళతనము చేరువనే కూడితికి శ్రీ వేంకటేశ్వరుఁడ తేరిపోయినపనికి తిరుగ మాఁటేలా English(||pallavi||) aḍuganaga ninum̐ dalam̐su kaṁtaḍa nuṁḍuḍa melu aḍumaḍamu lĕṁdām̐ka naṁparā nīvu (||||) sĕṁtala verŏgadĕbai sittamu nīguṁḍam̐gā ne yĕṁtapriyamu sĕppina nemi sĕlavu iṁtaḍa guṭṭuna nuṁḍa nĕrim̐gevu gāga nīve kāṁtum̐ḍa nidriṁchuvārigāḽlu gaḍugavaśhamā (||||) avvala nĕvvadĕbasago asurusugu gām̐ga ninu navviṁcham̐bovu ṭissī nagum̐bāṭlu davvulabŏṁduvule savulu dagilevu nīvu nanu nĕvvaga nīruvaṭṭugunu neyi maṁdagunā (||||) vere yesadino talam̐si veḍugalu sĕlam̐gam̐ga kūrimi nem̐ baigŏnuḍa kūḽadanamu seruvane kūḍidigi śhrī veṁkaḍeśhvarum̐ḍa teriboyinabanigi tiruga mām̐ṭelā