Title (Indic)అతను చే నెట్టయిన నౌదుఁగాక యీ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) అతను చే నెట్టయిన నౌదుఁగాక యీ- గతిమాలి సొలసే కాయము నాకేఁటికే (॥అతను॥) బాససేసి యైనఁ గొంత పట్టలేను చిత్తము దోసము మాటాడఁ దనతో నాకును అసలాఁపలేక చేరి యంటిఁ గాక యింత- సేసిన యాతనిమోము చెల్లఁబో నేఁజూతునా (॥అతను॥) దగ్గరి నావద్దఁ దనతరుణిఁ దలఁచినంత సిగ్గుపడవలెను నాచిత్తమునందే నిగ్గుదేరేకాఁకతోడ నిలువలేఁ గాక యింత- బగ్గన నాదేహమిది పారవేయ సరకా (॥అతను॥) దేవుఁడంటాఁ దనమీఁద తెగి సొలపుమాటల మోవనాడలేక యింత మొక్కితిఁ గాని శ్రీ వేంకటేశుఁడింత చిత్తిణివిద్యల నాతఁ- డేవంక కేఁగినను మాయింటికి విచ్చేసెఁగా English(||pallavi||) adanu se nĕṭṭayina naudum̐gāga yī- gadimāli sŏlase kāyamu nāgem̐ṭige (||adanu||) bāsasesi yainam̐ gŏṁta paṭṭalenu sittamu dosamu māḍāḍam̐ danado nāgunu asalām̐palega seri yaṁṭim̐ gāga yiṁta- sesina yādanimomu sĕllam̐bo nem̐jūdunā (||adanu||) daggari nāvaddam̐ danadaruṇim̐ dalam̐sinaṁta siggubaḍavalĕnu nāsittamunaṁde nigguderegām̐kadoḍa niluvalem̐ gāga yiṁta- baggana nādehamidi pāraveya saragā (||adanu||) devum̐ḍaṁṭām̐ danamīm̐da tĕgi sŏlabumāḍala movanāḍalega yiṁta mŏkkidim̐ gāni śhrī veṁkaḍeśhum̐ḍiṁta sittiṇividyala nādam̐- ḍevaṁka kem̐ginanu māyiṁṭigi vichchesĕm̐gā