Title (Indic)ఆపెకు మాకును నేఁడు అంతర మెంత WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆపెకు మాకును నేఁడు అంతర మెంత కాఁపురాలు వేరె వేరె కనుకొంట గాక (॥ఆపె॥) మాటలమందులు నూరి మరిగించుకొనె నాపె యీటు వెట్టుకోము నేము ఇల్లాండ్లము చీటికి మాటికి నీతో సిగ్గులు వీడీని నాపె కూటముల నేమైతే గుట్టుగలవారము (॥ఆపె॥) చెవిలో మంత్రాలు చెప్పి చే చిక్కించుకొనె నాపె తివిరి వింతసేయము దేవుళ్లము చవులుగా మోవి ఇచ్చి చనవులు చూపె నాపె ఇవల నేమైతే నీకు ఇచ్చకపు వారము (॥ఆపె॥) జంగిలి మాయలు సేసి జట్టిగొన(నె) నిన్ను నాపె కంగువెట్టుకోము నేము గరితెలము అంగవించి శ్రీ వేంకటాధిప నన్నుఁ గూడితి సంగతి నీకు నేమైతే సతమైన వారము English(||pallavi||) ābĕgu māgunu nem̐ḍu aṁtara mĕṁta kām̐purālu verĕ verĕ kanugŏṁṭa gāga (||ābĕ||) māḍalamaṁdulu nūri marigiṁchugŏnĕ nābĕ yīḍu vĕṭṭugomu nemu illāṁḍlamu sīḍigi māḍigi nīdo siggulu vīḍīni nābĕ kūḍamula nemaide guṭṭugalavāramu (||ābĕ||) sĕvilo maṁtrālu sĕppi se sikkiṁchugŏnĕ nābĕ tiviri viṁtaseyamu devuḽlamu savulugā movi ichchi sanavulu sūbĕ nābĕ ivala nemaide nīgu ichchagabu vāramu (||ābĕ||) jaṁgili māyalu sesi jaṭṭigŏna(nĕ) ninnu nābĕ kaṁguvĕṭṭugomu nemu garidĕlamu aṁgaviṁchi śhrī veṁkaḍādhiba nannum̐ gūḍidi saṁgadi nīgu nemaide sadamaina vāramu