Abhinava taaravo .. naa .. abhimaana taaravo

అభినవ తారవో .. నా .. అభిమాన తారవో
Year
Language

పల్లవి:

అభినవ తారవో .. నా .. అభిమాన తారవో
అభినవ తారవో అభినయన రసమయ కాంతిధారవో
అభినయ రసమయ కాంతిధారవో
మంజుల మధుకర సింజాల సుమసర శింజిని శివరంజనీ ... శివరంజనీ

చరణం 1:

అది దరహాసమా .. మరి మధుమాసమా
ఆ మరునికి దొరికిన అవకాశమా
అవి చెరణమ్ములా ? శశికిరణంబులా ?
నా తరుణ భావనా హరినమ్ములా

చరణం 2:

ఆ నయనాలు విరిసిన చాలు అమావస నిశిలో చంద్రోదయాలు
ఆ నయనాలు విరిసిన చాలు అమావస నిశిలో చంద్రోదయాలు
ఆ నెనడుము ఆడిన చాలు ...
ఆ నెనడుము ఆడిన చాలు రవళించును పదకవితా ప్రభందాలు

చరణం 3:

నీ శృంగార లలిత భంగిమలో పొంగిపోదురే ఋషులైనా
నీ కరుణరసానిష్కరణంలో కరిగిపోదురే కర్కశులైనా
వీరమా ... నీ కుపిత నేత్ర సంచారమే !
హాస్యమా .... నీకది చిటికలోన వశ్యమే !

pallavi:

abhinava tāravo .. nā .. abhimāna tāravo
abhinava tāravo abhinayana rasamaya kāṁtidhāravo
abhinaya rasamaya kāṁtidhāravo
maṁjula madhugara siṁjāla sumasara śhiṁjini śhivaraṁjanī ... śhivaraṁjanī

saraṇaṁ 1:

adi darahāsamā .. mari madhumāsamā
ā marunigi dŏrigina avagāśhamā
avi sĕraṇammulā ? śhaśhigiraṇaṁbulā ?
nā taruṇa bhāvanā harinammulā

saraṇaṁ 2:

ā nayanālu virisina sālu amāvasa niśhilo saṁdrodayālu
ā nayanālu virisina sālu amāvasa niśhilo saṁdrodayālu
ā nĕnaḍumu āḍina sālu ...
ā nĕnaḍumu āḍina sālu ravaḽiṁchunu padagavidā prabhaṁdālu

saraṇaṁ 3:

nī śhṛṁgāra lalida bhaṁgimalo pŏṁgibodure ṛṣhulainā
nī karuṇarasāniṣhkaraṇaṁlo karigibodure kargaśhulainā
vīramā ... nī kubida netra saṁchārame !
hāsyamā .... nīgadi siḍigalona vaśhyame !